Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపోటుతో సీనియర్‌ జర్నలిస్టు అనిల్‌కుమార్‌ మృతి.. సీఎం రేవంత్‌ సంతాపం

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రముఖ దినపత్రికల్లో సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ జర్నలిస్టు అనిల్ కుమార్ 55 ఏళ్ల వయసులో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కర్నాటకలోని ఓ దేవాలయాన్ని సందర్శించిన ఆయన కుటుంబంతో సహా కారులో తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది..

గుండెపోటుతో  సీనియర్‌ జర్నలిస్టు అనిల్‌కుమార్‌ మృతి.. సీఎం రేవంత్‌ సంతాపం
Senior Journalist Anil Kumar
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2025 | 4:22 PM

హైదరాబాద్‌, జనవరి 14: ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు అనిల్‌కుమార్‌ (55) హఠాన్మరణం చెందారు. కర్ణాటకలోని గోకర్ణ శ్రీ మురుదేశ్వర ఆలయంలో దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు భత్కల్‌లోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ అనిల్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారు. వరంగల్‌లలో వివిధ ప్రచురణలతో పనిచేసిన అనిల్ కుమార్ 2022లో ‘తెలంగాణ టుడే’లో చేరారు.

సీనియర్‌ జర్నలిస్టు అనిల్‌కుమార్‌ పలు ప్రసిద్ధ దినపత్రికల్లో జర్నలిస్టుగా సుదీర్ఘంగా సేవలందిచారు. 1994లో ‘న్యూస్‌ టైమ్‌’లో రిపోర్టర్‌గా కెరీర్‌ ఆరంభించారు. టీఎన్‌ఐ చెన్నై, ఏపీ టైమ్స్‌, డైలీ హిందీ మిలాప్‌ వంటి ప్రముఖ దినపత్రికల్లో సుధీర్ఘకాలం పనిచేశారు. ఆరేళ్లపాటు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పనిచేశారు. స్వతంత్ర వార్తలో బ్యూరో ఇన్‌చార్జిగా 12 ఏళ్లపాటు సేవలందించారు. ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో ఆరేళ్లు పనిచేశారు. అనంతరం 2022లో తెలంగాణ టుడే దినపత్రికలో చేరారు. అనిల్‌కుమార్‌ కుటుంబంతో హైదరాబాద్‌లోని సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య ఆషా, ఇద్దరు పిల్లలు రష్మి, రాహుల్‌ ఉన్నారు. అనిల్ తన భార్య ఆశా, కూతురు రష్మీతో కలిసి కర్ణాటకలోని గోకర్ణలో తాజాగా విహారయాత్రకు వెళ్లారు. శ్రీ మురుడేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై మరణించారు. అనిల్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు అల్వాల్ శ్మశానవాటికలో నిర్వహించారు.

సీనియర్‌ జర్నలిస్టు అనిల్‌కుమార్‌ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుగా అనిల్‌ కుమార్‌ పత్రికారంగానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి టి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.