AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బ్యాంకులో వర్క్‌ స్ట్రెస్‌.. భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!

కష్టపడి చదివి కళల కొలువు సొంతం చేసుకున్న ఆమెకు కొన్ని రోజుల్లోనే ఆఫీస్ లో చుక్కలు కనిపించాయి. బ్యాంకు ఉద్యోగం సొంతం చేసుకున్న ఆమె కొన్నాళ్లకే అక్కడి పని ఒత్తిడి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Hyderabad: బ్యాంకులో వర్క్‌ స్ట్రెస్‌.. భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
Bank Employee Suicide
Srilakshmi C
|

Updated on: Jan 10, 2025 | 11:06 AM

Share

నిజాంపేట, జనవరి 10: ఓ బ్యాంకు ఉద్యోగిని పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి ఠాణా పరిధిలో గురువారం (జనవరి 9) చోటు చేసుకుంది. సీఐ జె ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఐటీ ఉద్యోగి. వృత్తి రిత్యా సత్యలావణ్య బ్యాంకు ఉద్యోగి కావడంతో హైదరాబాద్‌లోని బాచుపల్లి కేఆర్‌సీఆర్‌ కాలనీలోని ఎంఎన్‌ రెసిడెన్సీలో వీరి దంపతులు కాపురం ఉంటున్నారు. సత్య లావణ్య బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుంది. బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు తరచూ బంధుమిత్రుల వద్ద బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సంక్రాంతికి శుక్రవారం సొంతూరుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే గురువారం యథావిథిగా బ్యాంకు వెళ్లిన సత్యలావణ్య.. అదే రోజు మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదుగానీ నేరుగా అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పైకి వెళ్లి కిందకు దూకేసి, ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి తరలించగా.. కొంతసేపటికే ఆమె మృతి చెందింది.

సత్య లావణ్య పనిచేస్తున్న బ్యాంకులో పెరిగిన ఒత్తిడి గురించి పలు సందర్భాలలో తనతో చెప్పిందని ఆమె మామ ARSV ప్రసాద్ పోలీసులకు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!