AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pritish Nandy: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రితీశ్‌ నంది కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన బుధవారం ఉదయం ముంబైలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రితీశ్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..

Pritish Nandy: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
Filmmaker Pritish Nandy
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 09, 2025 | 11:50 AM

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమాహేమీలు కోల్పోగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రితీశ్‌ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ముంబైలోని తన నివాసంలో బుధవారం (జనవరి 8) గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రితీశ్‌ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు, ప్రితీష్ నంది స్నేహితుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయనకు నివాళులర్పిస్తూ..

‘నాకు అత్యంత ప్రియమైన, సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రితీశ్‌ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్‌. ముంబైలో నా కెరీర్‌ ప్రారంభ రోజుల్లో ప్రతీశ్‌ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తన జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్‌ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన్ని చాలా కాలంగా కలవలేదు. కానీ అతను నా ఫొటో ఫిల్మ్‌ఫేర్ కవర్‌పై ముద్రించడం నేను ఎప్పటికీ మరచిపోలేనని అనుపమ్ ఖేర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇర ప్రితీశ్‌ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఇక జర్నలిస్టు షీలా భట్‌కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఇవి కూడా చదవండి

ప్రితీష్ నంది.. వంటి కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాత మరొకరు ఉండబోరు. గుండెపోటులో ముంబైలో ఈ రోజు మరణించారు. అతను గేమ్ ఛేంజర్. 80ల ప్రారంభంలో జర్నలిజంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసినప్పుడు మేమంతా ఎంతో ఆశ్చర్యపడ్డాం. ఎన్నో సంఘటనలను ధైర్యంగా, బోల్డ్ అక్షరాల్లో.. ఆకట్టుకునే శీర్షికలు పెట్టి పెద్ద సైజు ఫొటోలను ప్రచురించేవారని పేర్కొన్నారు.

కాగా ప్రితీష్ నంది శివసేన మాజీ రాజ్యసభ సభ్యుడు, జంతు హక్కుల న్యాయవాది కూడా. ఆయ ‘సుర్’, ‘కాంతే’, ‘ఝంకార్ బీట్స్’, ‘చమేలీ’, ‘హజారోన్ ఖ్వైషీన్ ఐసీ’, ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ వంటి ఐకానిక్ మువీలను ప్రితీష్ నంది కమ్యూనికేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కించారు. ప్రితీష్ నంది ఇంగ్లీష్‌ కవిత్వంలో దాదాపు 40 పుస్తకాలు రాశారు. బెంగాలీ, ఉర్దూ, పంజాబీ నుంచి ఇంగ్లీష్‌లోకి ఎన్నో కవిత్వాలను అనువదించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.