ఇదో ముష్టి ప్రేమ కథా చిత్రమ్‌.. ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో భార్య పరార్!

గంపెడు పిల్లలు, గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకునే భర్తను కాదని.. ఓ భార్య నాలుగిళ్లు తిరిగి అడుక్కుని బతికే బిచ్చగాడితో పరారైంది. మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తానని భర్తకు చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన సదరు సతీమణి ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. పోలీస్ కేసు పెట్టాడు భర్త. తన ఇంటికి తరచూ ముష్టి కోసం వచ్చే బిచ్చాగాడిపై అనుమానంగా ఉందని పోలీసులకు చెప్పడం విశేషం..

ఇదో ముష్టి ప్రేమ కథా చిత్రమ్‌.. ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో భార్య పరార్!
Women Elopes With Beggar
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 07, 2025 | 1:48 PM

లక్నో, జనవరి 7: ఇంటి నిండా గంపెడు పిల్లలు.. సకల సౌఖ్యాలను అమర్చి ఏ లోటూ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న ఆ భర్తకు ఓ భార్యామణి ఊహించని షాకిచ్చింది. భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి తికానంలేని ఓ ముష్టి వాడితో వెళ్లిపోయింది. ఈ విచిత్ర ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(Uttarpradesh)లోని హ‌ర్దోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌ర్దోయ్ జిల్లాలో ఓ ఇంట్లో రాజు (45), రాజేశ్వరి (36) జంట కాపురం ఉంటున్నారు. ఈ జంటకు ఆరుగురు పిల్ల‌లు ఉన్నారు. వీరి కాపురంలో ఓ బిచ్చగాడు చిచ్చురేపాడు. నాన్హే పండిట్ (45) అనే వ్యక్తి అప్పుడప్పుడు భిక్షాటన చేయడానికి వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో బిచ్చగాడితో రాజేశ్వరికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ఫోన్‌ నెంబర్లు ఇచ్చుకుని, మాట్లాడేవరకు వెళ్లింది. ఈ క్రమంలో జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజేశ్వరి, తన కూతురు ఖుష్బూకు బట్టలు, కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్‌కి వెళుతున్నానని భర్త రాజుకు చెప్పి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తన భార్య బిచ్చ‌గాడితో వెళ్లిపోయిన‌ట్లు రాజు పోలీసు కేసు పెట్టాడు.

నానే పండిత్ అనే బిచ్చ‌గాడు అప్పుడు మా ఇంటి ప‌రిస‌రాల్లో అడుక్కునేవాడు. కొన్ని సంద‌ర్భాల్లో భార్య రాజేశ్వ‌రితో అత‌ను మాట్లాడటం గమనించాను. ఫోన్‌లో కూడా ఆ ఇద్ద‌రు సంభాషించేవార‌ని ఫిర్యాదులో రాజు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇటీవల ఓ బ‌ర్రెను అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌న భార్య ఆతడితో వెళ్లిపోయిన‌ట్లు రాజు ఫిర్యాదులో తెలిపాడు. దీంతో పోలీసులు భార‌తీయ న్యాయ సంహితలోని సెక్ష‌న్ 87 కింద బిచ్చ‌గాడిపై పోలీసులు మ‌హిళ‌ అప‌హ‌ర‌ణ కేసు న‌మోదు చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు బిచ్చగాడు నన్హే పండిట్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. నేరం రుజువైతే చ‌ట్టం ప్రకారం నిందితుడికి ప‌దేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.