AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందోనని చూసి అందరూ షాక్

సాధారణంగా ఫ్రిజ్‌ను దేని కోసం వాడతాం..! ఏముంది కూరగాయలు, ఐస్ క్రీమ్స్, డ్రింక్ బాటిల్స్.. ఇలా నిత్యావసరాలు కొన్ని పాడవ్వకుండా పెట్టుకుంటాం. అయితే ఇక్కడొక కేటుగాడు ఫ్రిడ్జ్‌ను డిఫెరెంట్‌గా వాడాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందోనని చూసి అందరూ షాక్
Viral
Ravi Kiran
|

Updated on: Jan 07, 2025 | 1:44 PM

Share

కేరళలోని కొచ్చిలో ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో మానవ పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయి. జనావాసాలు లేని ఈ ఇంట్లోని ఫ్రిజ్‌లో ప్యాకెట్‌లో భద్రపరిచిన పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం అంతా సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని స్థానిక పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోదాలు చేపట్టారు. వెతకగా, అక్కడే ఉన్న ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లగా.. అక్కడున్న ఫ్రిడ్జ్‌లో ఈ పుర్రె, ఎముకలను గుర్తించారు ఖాకీలు. ఎముకలు మూడు వేర్వేరు కవర్లలో ప్యాక్ చేసి ఉండగా.. పుర్రె చాలా సంవత్సరాల కిందటిదిగా పోలీసులు అంచనా వేశారు. ఆ పుర్రె, ఎముకలు ఎవరివి అనేది తెలియడానికి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తీసుకెళ్లారు. ఇంట్లో కరెంటు లేకపోవడం.. ఫ్రిజ్‌లో కంప్రెసర్ ఉండకపోవడం గమనార్హం.

ఈ ఘటన చొట్టనిక్కరలోని ఎరువేలి సమీపంలోని ప్యాలెస్ చౌరస్తాలో, చోట్టనిక్కర భగవతి ఆలయానికి ఉత్తరాన 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో జరిగింది. ఈ ఇల్లు చాలా సంవత్సరాల క్రితమే తాళం వేసి ఉంది. 14 ఎకరాల స్థలంలో ఉన్న ఈ ఇల్లు ఎర్నాకులంకు చెందిన వ్యక్తికి చెందినదిగా.. సుమారు 15-20 సంవత్సరాలుగా ఎవరూ ఇక్కడ నివాసం ఉండట్లేదని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..