AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.?

Fruits and Milk: పాలు, పండ్లు విడివిడిగా అత్యంత పోషకమైనవి, కానీ కలిపి తీసుకున్నప్పుడు వాటి ప్రయోజనాలపై చాలా మందిలో సందేహాలున్నాయి. అందుకే, పాలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఆరోగ్య నిపుణుల సూచనలు కూడా పరిశీలిద్దాం.

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.?
Fruits and Milk
Rajashekher G
|

Updated on: Feb 08, 2026 | 12:21 PM

Share

పాలు, పండ్లు అనేవి మన ఆరోగ్యానికి చాలా అవసరమైన ఆహార పదార్థాలు. ఇవి రెండు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే, వీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది చాలా మందిలో ఉండే సందేహం. అయితే, కొన్ని పండ్లను పాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. మరికొన్నింటిని మాత్రం అలా తీసుకుంటే కొంచెం ఇబ్బందులు ఎదురుకావచ్చు. నిమ్మకాయలు, నారింజ వంటి పుల్లని పండ్లను పాలతో కలిపి తినడం వల్ల కొంతమందిలో కడుపు నొప్పి వస్తుంది. ఈ క్రమంలోనే పాలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే, పండ్లు, పాలు కలిపి తీసుకోవచ్చా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల సూచనలు కూడా పరిశీలిద్దాం.

పండ్లు, పాలు కలిపి తినడం సురక్షితమా?

చాలామంది పండ్లలోని ఆమ్లం పాలతో కలిసితే కడుపులో సమస్యలు రావచ్చు అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్ కోచ్ రాల్స్టన్ డిసౌజా ప్రకారం, పాలు కడుపులో స్రవించటం ఒక సహజ ప్రక్రియ. పాలను నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపితే విరుగుతుందని చింతించాల్సిన అవసరం లేదు. సాధారణంగా, జీర్ణక్రియలో పాలు స్వీకరించడం సహజమే అంటున్నారు.

పండ్లు, పాలను కలిపేటప్పుడు గమనించవలసినవి:

తీపి పండ్లు: అరటిపండు, మామిడి వంటి తీపి పండ్లను పాలలో కలపడం మంచిది.

పుల్లని పండ్లు: నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లను పాలలో కలిపితే కొంతమందిలో కడుపు నొప్పి లేదా అసిడిటీ సమస్యలు కలగవచ్చు.

వ్యక్తిగత జీర్ణశక్తి: ప్రతి మనిషి జీర్ణవ్యవస్థ వేరు కాబట్టి, గ్యాస్ లేదా అసిడిటీ సమస్య ఉంటే పండ్లు, పాలను విడిగా తీసుకోవడం మంచిది.

తయారీ విధానం: పాలను ముందుగా బాగా మరిగించి, చల్లబడి అప్పుడు మాత్రమే పండ్లతో కలపడం సురక్షితం.

ఆరోగ్యకరులైన వ్యక్తులు పాలు, తీపి పండ్లను మితంగా కలిపి అల్పాహారం లేదా స్మూతీగా తీసుకోవచ్చు. ముఖ్యంగా, శ్రద్ధ తీసుకోవాల్సిన పాయింట్.. ప్రతి ఒక్కరి జీర్ణక్రియ విభిన్నంగా ఉండడం. కాబట్టి కొత్త కాంబినేషన్లను ప్రయత్నించే ముందు చిన్న పరిమాణంలో ప్రారంభించడం ఉత్తమం. ఆ తర్వాత ఫలితాలను బట్టి క్రమంగా పరిమాణాన్ని పెంచుకోవచ్చు.

Follow Us