KNRUHS 2nd Phase PG Admissions: పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల: కాళోజీ హెల్త్‌ వర్సిటీ

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మిగిలిన పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద అభ్యర్ధులు కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు వీలుగా నీట్ పీజీ కటాఫ్ మార్కులు కూడా తగ్గించింది. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది..

KNRUHS 2nd Phase PG Admissions: పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల: కాళోజీ హెల్త్‌ వర్సిటీ
KNRUHS Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2025 | 9:11 AM

హైదరాబాద్‌, జనవరి 10: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో పీజీ వైద్యవిద్య సీట్ల ప్రవేశాలకు సంబంధించి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో నీట్‌ పీజీ 2024 కటాఫ్‌ మార్కులు తగ్గించడంతోపాటు ఆ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఇచ్చిన ప్రకటనలో ప్రవేశాలకు అర్హతలు.. జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ స్కోర్‌ 50 పర్సంటైల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీడబ్ల్యూడీ కేటగిరీలో 40 పర్సంటైల్‌గా ఉంది. అయితే తాజాగా ఈ కటాఫ్‌ మార్కులను జనరల్‌కు 15, మిగిలిన కేటగిరీలకు 10 పర్సంటైల్‌ చొప్పున తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు జనవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లను ఈ ప్రకటన కింద భర్తీ చేయనున్నారు.

SSC CGL టైర్‌2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌.. త్వరలోనే హాల్‌ టికెట్లు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్‌) పరీక్ష 2024 టైర్‌ 2 రాత పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అడ్మిట్‌ కార్డులు జనవరి 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో టైర్‌ 1 రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2024 తుది ఫలితాలు విడుదల

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ 1) 2024 తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 590 మందిని తదుపరి పరీక్షలకు ఎంపిక చేశారు. పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. తుది ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 15 రోజులలోపు కమిషన్ వెబ్‌సైట్‌లో 30 రోజుల పాటు మాత్రమే ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.