Bus Driver Jobs: టెన్త్‌ పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. జర్మనీలో బస్‌డ్రైవర్‌ ఉద్యోగాలు మీకోసమే.. TOMCOM

ఆర్ధిక ఇబ్బందుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల ఎంతో మంది చదువు పదో తరగతితో ముగిసి ఉంటుంది. మరికొంత మంది ఇంటర్ తో చదువుకు స్వస్తి చెప్పి ఉంటారు. ఇలాంటి వారికి TOMCOM అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్.. ఇంటర్ అర్హతతో జపాన్ దేశంలో బస్సు డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతుంది. మధ్యలో దళారులతో సంబంధం లేకుండా తెలంగాణ సర్కార్ నేరుగా ఈ నియామకాలు చేపడుతుంది..

Bus Driver Jobs: టెన్త్‌ పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. జర్మనీలో బస్‌డ్రైవర్‌ ఉద్యోగాలు మీకోసమే.. TOMCOM
Bus Driver Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2025 | 2:55 PM

హైదరాబాద్‌, జనవరి 14: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్. విదేశాల్లో కొలువు దక్కించుకునేందకు చక్కని అవకాశం మీ గుమ్మం ముందుకొచ్చింది. జర్మనీలో బస్‌డ్రైవర్‌ పోస్టులకు భారీ డిమాండ్‌ ఉంది. ఈ పోస్టుల నియామకాలకు తెలంగాణ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌) జనవరి 10వ తేదీన ఒక ప్రకటనలో తెలిపింది. టామ్‌కామ్‌ విదేశాల్లో ఉద్యోగావ కాశాల గురించి రాష్ట్ర యువతకు సమాచారం చేరవేయడమేకాకుండా.. అధికారికంగా ఆయా ఉద్యోగాల్లో చేరేందుకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. దళారుల చేతిలోపడి మోసపోకుండా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చేపట్టే నియామకాలు ఇవు. గతంలోనూ టాక్‌కామ్‌ పలు దేశాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించింది. తాజాగా జపాన్‌లో బస్‌ డ్రైవర్ల నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది.

పదో తరగతి ఉత్తీర్ణులై, రెండేళ్ల క్రితం హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ తీసుకున్న వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 24 యేళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసున్న వారు మాత్రమే అర్హులని పేర్కొంది. వారికి జర్మనీ భాషలో ఏ-2 స్థాయి నైపుణ్యం కూడా ఉండాలని సూచించింది. భాషా నైపుణ్యాల కోసం అవసరమైన సహాయం చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 2400 యూరోలు (భారతీయ కరెన్సీలో రూ.2.1 8 లక్షలు) చొప్పున ఆదాయం లభిస్తుందని తెలిపింది. పూర్తి వివరాలకు టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ సంప్రదించవచ్చు లేదా 9440052592, 8125251408, 9440049013, 9440049645 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించింది.

ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. పీజీ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో జనవరి 24 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రవేశాల విభాగం సంచాలకుడు ప్రొఫెసర్‌ ఐ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 23గా నిర్ణయించారు. అపరాధ రుసుంతో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.osmania.ac.in, www.ouadmissions.com వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.