Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే ఆకర్షణీయ జీతం మీ సొంతం
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో జనవరి 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మరో మూడు రోజుల్లో దరఖాస్తు ముగింపు గడువు ముగియనుంది. ఎంపికైన వారు మంచి జీతంతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు..
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 17, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రూరల్ & అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లియేబిలిటీస్, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్.. విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టులు వివరాలు ఇలా..
అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్, మేనేజర్ – సేల్స్, మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్ షిప్, హెడ్ – ఎస్‌ఎంఈ సెల్, ఆఫీసర్ – సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్ – సెక్యూరిటీ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ – సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్ట్, సీనియర్ మేనేజర్ – సి&ఐసి రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ – సి&ఐసి క్రెడిట్ అనలిస్ట్ తదితరాలు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్‌డీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు జనవరి 17వ తేదీ గడువు సమయం ముగింపులోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్ధులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం..
రీజనింగ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో 75 ప్రశ్నలకు 150 మార్కుల చొప్పున పరీక్ష జరుగుతుంది. మొత్తం ప్రశ్నల సంఖ్య 150. 225 మార్కులకు 150 నిమిషాల వ్యవధిలో ఈ పరీక్ష జరుగుతుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.