Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ పేరిట వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని పరార్‌! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రేమ పేరుతో యువతులకు వలేసి మాయమాటలు చెప్పి వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లో వేశారు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి, వాళ్లను పెళ్లిళ్లు చేసుకుని, సంతానం కూడా కలిగాక.. చెప్పాపెట్టకుండా ఇల్లోదిలి పరారవుతున్న ఘరానా మోసగాడు ఎట్టకేలకు చిక్కాడు..

ప్రేమ పేరిట వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని పరార్‌! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Man Arrested For Cheating 3 Women
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2025 | 4:49 PM

మేడ్చల్‌, జనవరి 14: మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడో కేటుగాడు. తాజాగా ఇతగాడి బండారం రెండో భార్య కనిపెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జవహర్‌నగర్ పోలీసులు నిత్య పెళ్లి కొడుకుని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం..

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌, అంబేద్కర్‌నగర్‌ గబ్బిబాల్‌పేట్‌లో లక్ష్మణరావు (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఇతడికి 2014లో బంధువుల అమ్మాయి అనూషతో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఆమెతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి (25)తో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికి మెదక్‌ చర్చిలో 2021లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఆమెతో కూడా విభేదాల కారణంగా దూరంగా ఉంటూ తప్పించుకుని తిరగసాగాడు. ఇక 2022లో శబరి అనే మరో యువతితో పరిచయం పెంచుకుని ఆమెనూ వివాహం చేసుకున్నాడు.

లక్ష్మణరావు మల్కాజిగిరిలో ఉంటున్నాడని రెండో భార్య లీలావతి కుటుంబ సభ్యులు తెలుసుకుని అక్కడికి చేరుకోగా.. అక్కడ మరో మహిళ శబరిని వివాహం చేసుకున్నట్లు తెలుసుకుని షాకయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మొత్తం ముగ్గురిని వివాహం చేసుకున్న లక్ష్మణరావుపై లీలావతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లక్ష్మణరావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.