AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పతంగులు ఎగురవేస్తూ గుట్టపైకి వెళ్లారు.. అక్కడ సీన్ చూసి పరుగో పరుగు..

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Hyderabad: పతంగులు ఎగురవేస్తూ గుట్టపైకి వెళ్లారు.. అక్కడ సీన్ చూసి పరుగో పరుగు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2025 | 5:00 PM

Share

హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది.. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్థానికులు గాలిపటాలు ఎగరవేస్తుండగా గుట్ట దగ్గర రెండు మృతదేహాలు కనిపించడంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి.. ఇద్దరినీ.. దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.

మృతుల్లో యువతి, యువకుడు ఉన్నారు. ఇద్దరినీ కత్తులతో పొడిచి.. ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలం నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.

అయితే.. ఘటనా స్థలానికి కొంత దూరంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా..? లేక మరెవరైనా ఇంతటి ఘోరానికి పాల్పడ్డారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, షూ లను చూసి నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో