కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం…ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ప్రభల ఉత్సవాలు కోనసీమలోని కొత్తపేటలో అంగరంగ వైభవంగా జరిగాయి. మకర సంక్రాంతి రోజు జరిగే ఏకైక ప్రభల ఉత్సవం కొత్తపేట ప్రభల తీర్థం. 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొత్తపేట ప్రభల ఉత్సవాలు తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఉత్సవాలను కనుల పండుగగా తిలకించారు.
ప్రభలను తీసుకువచ్చేవారంతా ఎవరికివారు కమిటీలు గా ఏర్పడి పోటాపోటీగా ప్రభలను అలంకరించి మేళ తాళాలు, డిజె డాన్సులు, డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పులతో భారీ ఊరేగింపుగా కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ కు తీసుకువచ్చారు. ప్రతిచోట కనుమ రోజు మాత్రమే ప్రభల ఉత్సవాలు జరుగుతుండగా కోనసీమలోని కొత్తపేటలో మాత్రం మకర సంక్రాంతి రోజున మాత్రమే ఏకైక ప్రభల ఉత్సవాలు జరగడం విశేషంగా చెప్పవచ్చు. పోటా పోటీగా ప్రభలను అలంకరణలు చేసి ఊరేగింపుగా తీసుకువచ్చిన తీరు ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. అచ్చరభ శరభ అనుకుంటూ ప్రభలను తమ తమ ఏరియాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడంలో ఎంతో ప్రత్యేకత నెలకొంది. కొత్తపేటలో ప్రతి ఏట సంక్రాంతి పండుగ రోజున జరగతున్న ఈ ప్రభల ఉత్సవాలను జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నారంటే ఈ ఉత్సవాలు ఎంత పెద్ద స్థాయిలో ఉంటాయో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఉత్సవాల్లో భాగంగా తీర్థం సందర్భంగా రాత్రికి జరిగిన భారీ ఎత్తున బాణసంచా కాల్పులు ఇక్కడ ప్రత్యేకతగా నిలిచాయి. మొదటగా బోడిపాలెం వంతెనవద్దనుండి పాతరామాలయం వీరభద్రుని (తల్లి ప్రభ ) బయలుదేరగా దాని వెనుక బోడిపాలెం వంతెన భక్తఆంజనేయస్వామి ప్రభ, కొత్త రామాలయం, బంగారమ్మతల్లి, ముద్రగడవీది, సంతోష్ నగర్, రామయ్యవీది, రాజరాజేశ్వరి ఇంకా పలువీధులనుండి ఊరేగింపుగా బయలుదేరి కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీగ్రౌండ్ వద్దకు చేరుకున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దోమలకు దోమలతోనే చెక్.. ఆస్ట్రేలియాలో సరికొత్త ప్రయోగం!
బాహుబలి వల.. 50 టన్నుల చేపలు చిక్కాల్సిందే..
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
బీర్ల ప్రియులకు షాక్.. కింగ్‌ఫిషర్ షాకింగ్ డెసిషన్
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..