AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..

కుటుంబ కలహాలతో ఇంజనీర్ దారుణ హత్యకు గుర్యాడు. పిల్లలను తీసుకెళ్లడానికి వెళ్లిన భర్తపై భార్య బంధువుల దాడికి పాల్పడ్డాడు.. ఆరేళ్ల కాపురం, ఇద్దరు పిల్లలున్నా.. చివరికి ప్రాణాలు తీశారు. ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వొచ్చు కదా?' అంటూ తల్లిదండ్రుల గుండెలవిసే రోదిస్తున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
Tragedy In Prakasam
Fairoz Baig
| Edited By: Krishna S|

Updated on: Nov 02, 2025 | 8:39 PM

Share

భార్యల చేతుల్లో భర్తలు చనిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా కడతేరుస్తున్నాయి. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతూ.. పిల్లలను అనాథలను చేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాలు ఒక ఇంజనీర్ ప్రాణాలను బలిగొన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాణి నగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య బంధువులు దాడి చేయడంతో వంశీ కుమార్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. వంశీ కుమార్ – దివ్య కీర్తిలకు ఆరేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత ఆరు నెలలుగా భార్య దివ్య, పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది.

ఈ క్రమంలో పిల్లలను తన వెంట తీసుకెళ్లడానికి వంశీ కుమార్ ఈ రోజు ఉదయం వాణి నగర్‌లోని భార్య ఇంటికి వెళ్లారు. అక్కడ భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. భార్యాభర్తల ఘర్షణ తారాస్థాయికి చేరడంతో దివ్య కుటుంబ సభ్యులు వంశీ కుమార్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడిలో వంశీ స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన వంశీ కుమార్ హైదరాబాద్‌లో ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

తల్లిదండ్రుల ఆవేదన

కుమారుడిని కోల్పోయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. “ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వొచ్చు కదా… బిడ్డను చంపేస్తారా?” అంటూ దీనంగా ప్రశ్నిస్తున్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడిలో భార్య తరఫు బంధువులే పాల్పడ్డా..రా? లేక ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి