AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2025: ఆయూష్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

APMSRB AYUSH Recruitment 2025 notification: రాష్ట్ర ఆయూష్‌ శాఖలో.. గొల్లపూడి, విజవాడలో ఔట్ సోర్సింగ్‌, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (APMSRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

AP Govt Jobs 2025: ఆయూష్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
APMSRB AYUSH Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 03, 2025 | 6:25 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ఆయూష్‌ శాఖలో.. గొల్లపూడి, విజవాడలో ఔట్ సోర్సింగ్‌, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (APMSRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 107 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు..

  • స్టేట్ ప్రొగ్రామ్‌ మేనేజర్‌
  • ఫైనాన్స్‌ మేనేజర్‌
  • డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌
  • సైకియార్టిస్ట్‌
  • ఆయూష్‌ డాక్టర్‌(ఆయుర్వేద)
  • ఆయూష్‌ డాక్టర్‌(హోమియోపతి)
  • ఆయూష్‌ డాక్టర్‌(యునాని)
  • యోగా ఇన్‌స్ట్రక్టర్స్‌

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎండీ, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025, నవంబర్‌ 1వ తేదీ నాటికి స్టేట్‌, డిస్ట్రిక్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌కు 21 నుంచి 60 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టేట్ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.75,000, డిస్ట్రిక్, ఫైనాన్స్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000, సైకియార్టిస్ట్‌ పోస్టులకు రూ.15,000, ఆయూస్‌ డాక్టర్‌ పోస్టులకు రూ.40,000, యోగా ఇన్‌స్ట్రక్టర్స్‌ పోస్టులకు రూ.27,500 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం