నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే
మొంథా తుఫాన్ విధ్వంసం నుంచి ఓరుగల్లు ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 400కి పైగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో ఇసుక మేటలు, రహదారులపై తడిసిన ధాన్యం అన్నదాతకు తీరని దుఃఖాన్ని మిగిల్చాయి.
మరోవైపు ముంపు కాలనీల్లో ఇళ్లు బురదమయం అయ్యాయి. వరంగల్, ఖమ్మంలోని ముంపు కాలనీల ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి చెమటోడుస్తున్నారు. వరదనీటితో పాటు కొట్టుకొచ్చిన పాములు కాలనీల్లో బుసలు కొడుతున్నాయి. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హనుమకొండలోని అమరావతీనగర్, నవయుగకాలనీ, టీవీటవర్స్ కాలనీ, గోకుల్‌నగర్, విద్యానగర్, సమ్మయ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని నిత్యావసరాలు, సామగ్రి, విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. శుక్రవారం వరద తగ్గడంతో ఇళ్లల్లో సామగ్రి, వస్తువులు, విద్యార్థుల పుస్తకాలు ప్రధాన రోడ్లపై ఆరబెట్టారు. నగరంలోని పలు ప్రధాన రహదారులు సైతం పూర్తిగా దెబ్బతిని ఆనవాళ్లు కోల్పోయాయి. ఖమ్మం నగరం, ఏదులాపురం పురపాలికలో పలు కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లల్లోకి చేరుకున్నారు. బాధితులంతా ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రహదారులను ఖమ్మం నగరపాలక సిబ్బంది ట్యాంకర్లతో శుభ్రం చేశారు. వరద వచ్చిన ప్రతిసారీ వాననీరు, బురదతో ఇబ్బందులు తప్పడం లేదని.. ఏటా దుస్తులు, ఎలక్ట్రికల్ సామగ్రి దెబ్బతింటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ కరకట్ట త్వరితగతిన నిర్మించాలని వేడుకుంటున్నారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంలో నీట మునిగిన వరి పొలాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, చిగురుమామిడి, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాల్లో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. కొందరి పొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు పేరుకుపోయాయి. కల్లాలు, రోడ్లపై నిల్వ చేసిన వరి ధాన్యం పూర్తి స్థాయిలో ఎండకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
వినియోగదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

