Mana Shankara Vara Prasad Garu: చిరు – అనిల్ మూవీలో హైలెట్ అదే
సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలను డబుల్ చేసే మరో న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. వెంకటేష్‌తో వందకోట్ల సినిమా చేసిన అనిల్, చిరుతో అంతకు మించి సక్సెస్‌ను కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ జోష్‌ను మరింత పెంచేలా చిరు సినిమాకు మరో సక్సెస్ సెంటిమెంట్‌ను యాడ్ చేశారు. అనిల్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సక్సెస్‌లు ఇచ్చిన వెంకీ, చిరు సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ న్యూస్ చాలా రోజులుగా ట్రెండ్ అవుతున్నా, వెంకీ షూటింగ్‌లో జాయిన్ కాకపోవటంతో అసలు గెస్ట్ రోల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్. కానీ ఫైనల్‌గా మెగా సెట్‌లో అడుగు పెట్టేశారు విక్టరీ హీరో. ఆల్రెడీ వెంకీ, చిరు కాంబినేషన్‌లో షూటింగ్ స్టార్ట్ అయిపోవటంతో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ అయ్యింది. స్టార్ హీరోలతోనూ అల్టిమేట్ ఫన్ క్రియేట్ చేసే అనిల్, ఈ క్రేజీ మూవీలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. చిరు సూపర్ హిట్ సాంగ్స్‌కు వెంకీ, వెంకీ సూపర్ హిట్ సాంగ్స్‌కు చిరు డ్యాన్స్ చేసేలా ఓ సూపర్ ఫన్ సిచ్యుయేషన్‌ను క్రియేట్ చేశారు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి. ఈ న్యూస్ వైరల్ కావటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. అసలు చిరు పాటకు వెంకీ ఎలా డ్యాన్స్ చేస్తారు. వెంకీ చేసిన ఏ పాటలకు చిరు స్టెప్పేస్తారు అని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఎగ్జైట్మెంట్‌కు తెర పడాలంటే మాత్రం 2026 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

