నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రెడీ అవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 4 నాటికి కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే, మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోసారి భారీ వర్షాలు పడితే పంట నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కొత్త అల్పపీడన ప్రభావం రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా, దాని మిగతా ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై వర్షాల రూపంలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో గాలివానలు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వినియోగదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!
అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

