TTD Hair Donation: తిరుమల శ్రీవారికి కాసులు కురిపిస్తోన్న కురులు.. భక్తుల తలనీలాల ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టీటీడీ కళ్యాణకట్ట తో పాటు చాలా ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఇలా గుండు కొట్టి గోవిందుడి మొక్కు తీర్చుతున్న భక్తుడి ఆదాయం ఏటా టీటీడీ కి రూ. 120 కోట్లకు పైగానే ఉంటుంది. ఇలా గత ఐదారేళ్లుగా టీటీడీకి తలనీలాల ఆదాయం అంతకంతకు పెరిగి ఈ ఏడాది మరో రికార్డు ను నమోదు చేయబోతోంది. ఇప్పటిదాకా ఏటా రూ.120 కోట్లు వస్తోందని టీటీడీ లెక్కలు చెబుతుండగా ఈ ఏడాది రూ. 150 కోట్లుకు పైనే ఉండబోతోంది..

TTD Hair Donation: తిరుమల శ్రీవారికి కాసులు కురిపిస్తోన్న కురులు.. భక్తుల తలనీలాల ఆదాయం ఎంతో తెలుసా?
TTD Hair Donation
Follow us
Raju M P R

| Edited By: Srilakshmi C

Updated on: Aug 13, 2023 | 8:21 PM

తిరుపతి, ఆగస్టు 13: ఆపదమొక్కుల స్వామి శ్రీ వెంకటేశ్వరుడి కి తలనీలాలు సమర్పించడం భక్తుల మొక్కులో ఒక భాగం. కోరుకున్న మొక్కులు తీరగానే తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తిరుమల కొండలు అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటుండంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టీటీడీ కళ్యాణకట్ట తో పాటు చాలా ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఇలా గుండు కొట్టి గోవిందుడి మొక్కు తీర్చుతున్న భక్తుడి ఆదాయం ఏటా టీటీడీ కి రూ. 120 కోట్లకు పైగానే ఉంటుంది. ఇలా గత ఐదారేళ్లుగా టీటీడీకి తలనీలాల ఆదాయం అంతకంతకు పెరిగి ఈ ఏడాది మరో రికార్డు ను నమోదు చేయబోతోంది. ఇప్పటిదాకా ఏటా రూ.120 కోట్లు వస్తోందని టీటీడీ లెక్కలు చెబుతుండగా ఈ ఏడాది రూ. 150 కోట్లుకు పైనే ఉండబోతోంది.

ప్రతి ఏడాది నాలుగు సార్లు ఈ ఆక్షన్ నిర్వహిస్తున్న టీటీడీ తలనీలాలను గ్రేడులు వారీగా విభజించి ఈ ఆక్షన్ నిర్వహిస్తోంది. 5 గ్రేడులుగా విభజించి తలనీలాలను వేలం వేస్తున్న టీటీడీ మొదటి మూడు గ్రేడ్ లలో డై, బ్లాక్ హెయిర్ ను వేరుచేసి రెండు రకాలుగా విభజిస్తుంది. తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ గౌడన్ లో భక్తుల తలనీలాల గ్రేడింగ్ ప్రక్రియ చేపడుతున్న టీటీడీ తిరుమల నుంచి ఒక రోజుకు 1400 కేజీల తలనీలాలను సేకరిస్తోంది. తిరుమలలోని టీటీడీ కళ్యాణ కట్ట, గెస్ట్ హౌస్ లో తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసిన టిటిడి తలనీలాలు సేకరణలో పలు జాగ్రత్తలు కూడా పాటిస్తోంది. మొక్కులో భాగంగా భక్తులు సమర్పించే తలనీలాలు రోజూ తడిగా ఉండే 1400 కేజీలు కాగా తలనీలాలు డ్రై అయ్యాక ఒకమెట్రిక్ టన్ను వరకు టిటిడి గోడౌన్ కు చేరుతుంది. కరోనా తర్వాత శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగానే తలనీలాల ఆదాయం టీటీడీ కి విపరీతంగా పెరిగింది.

గత ఐదారేళ్ళుగా ఏటా రూ. 120 కోట్లకు పైగా టిటిడి కి ఆదాయం వస్తుండగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.120 కోట్లు ఆలయం టిటిడి కి వచ్చింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు రెండుసార్లు ఈ ఆక్షన్ నిర్వహించిన టీటీడీ ఇప్పటివరకు దాదాపు రూ.105 కోట్ల మేర ఆదాయం పొందింది. మరో రెండు సార్లు ఈ ఆక్షన్ నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతుండగా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం ఏకంగా రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో భక్తులు సమర్పించే కురులు శ్రీవారి హుండీ ఆదాయానికి కాసులను కురిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..