TSPSC Group 2 Revised Exam Dates: తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త తేదీలు ఇవే..

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు పెద్ద ఎత్తున చేసిన డిమాండ్ ఫలించింది. పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్సీయస్సీ ప్రకటన వెలువరించింది. తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షల రీహెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది...

TSPSC Group 2 Revised Exam Dates: తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త తేదీలు ఇవే..
TSPSC Group 2 Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2023 | 5:59 PM

హైదరాబాద్‌, ఆగస్టు 13: టీఎస్సీయస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ సుమారు 2 వేల మంది అభ్యర్ధులు పెద్ద ఎత్తున చేసిన డిమాండ్ ఎట్టకేలకు ఫలించింది. పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్సీయస్సీ ప్రకటన వెలువరించింది. తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షల రీహెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. నవంబర్‌ 2,3 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించనుంది. పరీక్షకు వారం ముందు హాల్‌ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీఎస్సీయస్సీ ఈ రోజు ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌ 2 పరీక్షలను ఎస్సీయస్సీ వాయిదా వేసింది. ఇటీవల గ్రూప్‌ 2 అభ్యర్ధుల డిమాండ్‌ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు కమిషన్‌ వెల్లడించింది.

ఆగస్టు 10న టీఎస్సీయస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. సుమారు 2 వేల మంది అభ్యర్థులు నాంపల్లి నుంచి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ కమిషన్ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు కొందరు అభ్యర్ధులను అరెస్టు చేశారు. కమిషన్‌ వ్యవహారం దరిద్రంగా ఉందని, తమకు బోర్డుపై నమ్మకంలేదని, చైర్మన్‌ను వెంటనే మార్చాలని అభ్యర్ధులు నినాదాలు చేశారు. మరోవైపు ఇదే నెలలో గురుకుల పరీక్షలు జరుగుతుండగా ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలను నిర్వహించడానికి టీఎస్పీయస్సీ ఏర్పాట్లు చేసింది.

దీంతో రెండింటి మీద తాము దృష్టి సారించలేక పోతున్నామని, గతంలో పేపర్ లీకేజీ ఘటనతో సరిగా సన్నద్ధమవ్వలేకపోయామనిజజ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 పరీక్షను కనీసం 3 నెలలు పాటు వాయిదా వేయాలని కమిషన్‌ను కోరారు. పలు రాజకీయ పార్టీలు కూడా గ్రూప్‌ 2 అభ్యర్థుల ఆందోళనకు మద్దతు పలికడంతో దిగొచ్చిన కేసీఆర్ సర్కార్‌ అభ్యర్థులకు నష్టం జరగకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో సంప్రదింపులు జరిపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అభ్యర్థులందరికీ అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభించేలా కొత్త షెడ్యూల్‌ రూపొందించాలని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రూప్‌ 2 పరీక్షల రీ షెడ్యూల్‌ నేడు విడుదలైంది. ఈనెల 29, 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!