Viral: సమావేశంలో ఎంట్రీ ఇచ్చిన స్పెషల్ గెస్ట్.. దెబ్బకు అంతా పరార్.. అసలేమైందంటే..?
హైదరాబాద్ పాతబస్తీలో యునాని నాటు వైద్యులకు డిమాండ్ ఎక్కువే.. కార్పొరేటర్ డాక్టర్ల కన్నా ఈ వైద్యులకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది.. పాములు కరిచినా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న సాధారణంగా ఇక్కడి ప్రజలు పాతబస్తీ ఏరియాలోని యునాని వైద్యుల దగ్గరకు వెళతారు. అయితే.. ఇలాంటి వైద్యులందరూ ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: హైదరాబాద్ పాతబస్తీలో యునాని నాటు వైద్యులకు డిమాండ్ ఎక్కువే.. కార్పొరేటర్ డాక్టర్ల కన్నా ఈ వైద్యులకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది.. పాములు కరిచినా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న సాధారణంగా ఇక్కడి ప్రజలు పాతబస్తీ ఏరియాలోని యునాని వైద్యుల దగ్గరకు వెళతారు. అయితే.. ఇలాంటి వైద్యులందరూ ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ తమ పాత రోజులను గుర్తించుకొని ఒకరిపై ఒకరి జోకులు వేసుకుంటూ ఉండగా.. షకీల్ అనే వైద్యుడు తన స్నేహితుడిని పరిచయడం చేశాడు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు తన స్నేహితుడిని బయటకు తీశాడు.. ఇంకెముంది.. అందరూ షాక్ అయి అక్కడి నుంచి పరుగులు పెట్టారు.. ఇంతకీ ఆ వీఐపీ గెస్ట్ ఎవరో తెలుసా సుమారు 12 అడుగుల నాగుపాము.. స్నేహితుల సమావేశాలకు వచ్చే సమయంలో దారిలో కనిపిస్తే పట్టుకొని ఆ వైద్యుడు బ్యాగులో వేసుకొచ్చి ఫ్రెండ్స్ కి చూపించాడు. షకీల్ అనే వ్యక్తి వైద్యంతో పాటు సుమారు 32 సంవత్సరాల నుంచి పాములను పట్టుకొని అడవిలో వదలడం ఇతనికి అలవాటు. చాలా చోట్ల పోలీసులు అధికారులు కూడా షకీల్ సహకారం తీసుకుంటుంటారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో పాములు పట్టి అడవుల్లో వదిలానని.. ఎన్నోసార్లు తనకు పాములు కరిచాయని షకీల్ పేర్కొన్నారు. ఏదేమైనా.. పాములతో బీకేర్ ఫుల్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..