AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GenZల ఫేవరెట్ డెస్టినేషన్లు ఇవే..! చిన్న వయసులోనే వాటిపై యువత ఇంట్రెస్ట్‌

సాధారణంగా యువత అంటే పబ్‌లు, కేఫ్‌లు, విదేశీ పర్యటనలు లేదా లగ్జరీ స్టేకేషన్ల కోసం వెతుకుతారని అందరూ అనుకుంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్నదానికి భిన్నంగా, నేటి భారతీయ యువత (Gen Z) ఆధ్యాత్మిక యాత్రల వైపు ఆసక్తి చూపుతోంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో 53% మంది యాత్రికులు కేవలం యువత నుండే వస్తుండటం గమనార్హం.

GenZల ఫేవరెట్ డెస్టినేషన్లు ఇవే..! చిన్న వయసులోనే వాటిపై యువత ఇంట్రెస్ట్‌
Genz Travel Destination
Nikhil
|

Updated on: Jun 12, 2026 | 5:28 PM

Share

ఆధ్యాత్మిక యాత్రలు కేవలం పెద్దలకే పరిమితం అనుకుంటే పొరపాటే! నేటితరం యువత టెంపుల్ టౌన్స్ వైపు అడుగులు వేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యువత సంఖ్య పెరుగుతోంది. ఆధ్యాత్మిక పర్యాటకంలో 53% వాటాతో నేటితరం కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అసలు ఈ మార్పుకు కారణాలేంటి? బెంగళూరు నుంచి తిరుపతి వరకు, ఢిల్లీ నుంచి రిషికేశ్ వరకు ఆధ్యాత్మిక పర్యాటకంలో ‘జెన్ Z’ ఎలా దూసుకుపోతుందో, యాత్రల పట్ల వారి మారుతున్న దృక్పథం గురించి తెలుసుకుందాం!

ఎందుకు ఈ మార్పు?

గతంలో ఆధ్యాత్మిక యాత్రలు అంటే కేవలం పెద్దవారు చేసేవి లేదా కుటుంబంతో కలిసి వెళ్లేవి అని ఒక ముద్ర ఉండేది. కానీ, నేడు యువత తమ మూలాలను తెలుసుకోవడానికి, సాంస్కృతిక అనుభవాలను పొందడానికి సొంతంగా ఈ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరు-తిరుపతి, హైదరాబాద్-తిరుపతి, ఢిల్లీ-రిషికేశ్, పుణె-నాందేడ్ వంటి మార్గాల్లో ప్రయాణించే వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం ఈ మార్పుకు నిదర్శనం.

విప్లవాత్మక మార్పులు..

  • ఒకప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శన అంటే వారాల ముందే ప్లాన్ చేసుకునేవారు. కానీ నేటి టెక్నాలజీ యుగంలో, ప్రయాణానికి కేవలం నాలుగు గంటల ముందు బుక్ చేసుకునే వారి సంఖ్య 2022లో 16% ఉండగా, 2026 నాటికి 23%కి పెరిగింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఆఖరి నిమిషంలో తమ యాత్రను నిర్ణయించుకుంటున్నారు. ః
  • వారణాసిలోని అస్సీ ఘాట్, ఉజ్జయినిలోని మహంకాళేశ్వర్ ఆలయం వంటి ప్రదేశాల అందాలను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చూసిన యువత, వాటి వైపు ఆకర్షితులవుతున్నారు. డిజిటల్ కంటెంట్ ఈ పవిత్ర క్షేత్రాలను యువతకు మరింత చేరువ చేసింది.
  • కేవలం గుడిని చూసి రావడం కాకుండా, రిషికేశ్‌లో గంగా హారతిలో పాల్గొనడం, యోగా కేంద్రాలను సందర్శించడం లేదా ఆ ప్రాంత చరిత్రను తెలుసుకోవడం వంటి ‘పర్సనల్ ఎక్స్‌పీరియన్స్’కు యువత ప్రాధాన్యత ఇస్తోంది.

భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం మొత్తం దేశీయ పర్యాటక రంగంలో దాదాపు 60% వాటాను కలిగి ఉంది. అంటే ఇక్కడ మతం లేదా సంస్కృతి అనేది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, అది ఒక భారీ ఆర్థిక వ్యవస్థ కూడా. టెక్నాలజీ పెరిగినా, యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నా.. భారతీయ యువత తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలను వెతుక్కుంటూ పుణ్యక్షేత్రాలకు వెళ్లే ధోరణి ఆశ్చర్యకరమైన మరియు ఆహ్వానించదగ్గ మార్పు. ఈ యాత్రలు వారికి కేవలం పర్యాటకమే కాదు, తమ గుర్తింపును పదిలపరుచుకునే ఒక అద్భుతమైన మార్గంగా మారుతున్నాయి.

Follow Us