AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుమ్మ పుల్లతో తోమితే పళ్లు మెరవాల్సిందే.. చిగుళ్ల బలానికి, నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు..!

పసిపాపల నుంచి పెద్దల వరకు నోటి పరిశుభ్రత అత్యంత కీలకం. నేటి కాలంలో టూత్‌పేస్ట్, బ్రష్‌లకు అలవాటు పడినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తుమ్మ చెట్టు పుల్లతో బ్రష్‌ చేసుకోవడం కానవస్తుంది. తుమ్మ పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించి, నోటి దుర్వాసన సులువుగా తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలను సహజసిద్ధంగా అరికట్టడంలో బబూల్ దాతున్ అద్భుతంగా తోడ్పడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

తుమ్మ పుల్లతో తోమితే పళ్లు మెరవాల్సిందే.. చిగుళ్ల బలానికి, నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు..!
Babool Teeth Benefits
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2026 | 9:44 PM

Share

ఉదయాన్నే నిద్రలేవగానే ప్లాస్టిక్ బ్రష్, కెమికల్స్ ఉన్న టూత్‌పేస్ట్‌లతో పళ్లు తోముకోవడం మనందరికీ అలవాటు. కానీ, మన పూర్వీకులు దంతాల రక్షణ కోసం ప్రకృతి ప్రసాదించిన తుమ్మ చెట్టు పుల్లలను ఉపయోగించేవారు. ఆయుర్వేదంలోనూ, సాంప్రదాయ వైద్యంలోనూ తుమ్మ పుల్లకు ప్రత్యేక స్థానం ఉంది.

బబూల్ దాతున్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

తుమ్మ చెట్టు తొలవలో ఉండే సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. దీంతో రోజంతా నోరు తాజాగా ఉంటుంది. పళ్లపై పేరుకుపోయే ప్లాక్, మలినాలను తొలగించి చిగుళ్లను గట్టిపరచడంలో తుమ్మ పుల్ల సహాయపడుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా బబూల్ దాతున్ ఉపయోగించడం వల్ల పళ్లపై పసుపు రంగు గార పట్టకుండా నివారిస్తుంది. పళ్లను సహజ సిద్ధమైన కాంతితో మెరిసేలా చేస్తుంది.

ఉపయోగించే సరికొంత పద్ధతి:

చిటికెన వేలు మందంలో ఉండే తాజా, శుభ్రమైన తుమ్మ కొమ్మను ఎంచుకోవాలి. పుల్ల చివరి భాగాన్ని దంతాలతో మెల్లగా నమిలి, దారాల్లాంటి పీచు వచ్చేలా బ్రష్‌లా తయారు చేయాలి. ఈ పీచు భాగంతో పళ్లు, చిగుళ్లపై మృదువుగా రుద్దాలి. చిగుళ్లకు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. తోమడం పూర్తయిన తర్వాత శుభ్రమైన నీటితో నోటిని బాగా ముక్కోవాలి. ఉపయోగించిన పుల్లను వెంటనే పారేయాలి. ఒకే పుల్లను పదే పదే వాడకూడదు.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా రోజూ లేదా వారానికి కొన్ని రోజులు బబూల్ దాతున్ వాడటం వల్ల దంతాలు శతాబ్దం పాటు గట్టిగా, ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. అయితే తీవ్రమైన పంటి నొప్పులు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తుమ్మ పుల్ల..చిగుళ్ల బలానికి,నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు
తుమ్మ పుల్ల..చిగుళ్ల బలానికి,నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు
​వయసు పెరిగితే ఈ ఆహారం విషమే!
​వయసు పెరిగితే ఈ ఆహారం విషమే!
కరకరలాడే పనీర్ టిక్కా సింపుల్ రెసిపీ!
కరకరలాడే పనీర్ టిక్కా సింపుల్ రెసిపీ!
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే మీ కాఫీ కప్పులో ఈ మార్పు తప్పనిసరి!
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే మీ కాఫీ కప్పులో ఈ మార్పు తప్పనిసరి!
అవిసె గింజలతో ఇంట్లోనే కొల్లాజెన్ సీరమ్..ముడతలు మాయం.మెరుపు ఖాయం!
అవిసె గింజలతో ఇంట్లోనే కొల్లాజెన్ సీరమ్..ముడతలు మాయం.మెరుపు ఖాయం!
మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..
మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..
రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం
రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం
SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?
SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?