Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆగస్టు 14 నుంచి 21 వరకు పలు రైళ్ల రద్దు..ఇవీ పూర్తి వివరాలు..

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఏపీలోని విజయవాడ డివిజన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ పనులు ప్రారంభించారు. ఈ కారణంగా ఆగస్టు 14 నుండి 20 వరకు ఆయా రైల్వే మార్గాల్లోని పలు రైళ్లు రద్దు చేసినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి హెచ్ రాకేష్ తెలిపారు.

Hyderabad: ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆగస్టు 14 నుంచి 21 వరకు పలు రైళ్ల రద్దు..ఇవీ పూర్తి వివరాలు..
Indian Railways
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 13, 2023 | 8:06 AM

ఆగస్టు 14 నుంచి 21వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వేలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే అనేక రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. వివిధ కారణాల వల్ల అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ డివిజన్‌లలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపడుతున్న కారణంగా ఆగస్టు 14 నుంచి 21 వరకు ఆయా స్టేషన్ల నుంచి స్టార్ట్‌ అయ్యే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

కాజీపేట- డోర్నకల్‌ (07753)

డోర్నకల్‌- కాజీపేట (07754)

ఇవి కూడా చదవండి

డోర్నకల్‌- విజయవాడ (07755)

విజయవాడ- డోర్నకల్‌ (07756)

భద్రాచలం రోడ్‌- విజయవాడ (07278)

విజయవాడ- భద్రాచలం రోడ్‌ (07979)

కాజీపేట- సిర్పూర్‌టౌన్‌ (17003)

బల్లార్షా- కాజీపేట(17004)

సిర్పూర్‌టౌన్‌- భద్రాచలం రోడ్‌ (17034)

సికింద్రాబాద్‌- వరంగల్‌ (07462)

వరంగల్‌- హైదరాబాద్‌ (07463)

సిర్పూర్‌టౌన్‌- కరీంనగర్‌ (07766)

కరీంనగర్‌- నిజామాబాద్‌ (07893)

కాజీపేట – బల్లార్షా (17035)

కాచిగూడ- నిజామాబాద్‌ (07596)

నిజామాబాద్‌- కాచిగూడ(07593)

భద్రాచలంరోడ్‌- బల్లార్షా (17033)

బలార్షా-కాజీపేట(17036)

కరీంనగర్‌- సిర్పూర్‌ టౌన్‌(07765)

నిజామాబాద్‌- కరీంనగర్‌ (07894) వంటి పలు రైళ్లను ఆగస్టు 15 నుంచి 21 వరకు రద్దు చేస్తున్నారు.

వేర్వేరు ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు..

వచ్చే వారంలో ప్రయాణికుల డిమాండ్‌ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలియజేశారు.

ఆగస్టు 13, 14 తేదీల్లో తిరుపతి- కాకినాడ టౌన్‌ (07063), నర్సాపూర్‌- తిరుపతి (07061)

ఆగస్టు 14, 15 తేదీల్లో కాకినాడ టౌన్‌- తిరుపతి (07064), తిరుపతి- నర్సాపూర్‌ (07062), కాచిగూడ- విల్లుపురం (07424)

ఆగస్టు15న విల్లుపురం- కాచిగూడ (07425)

ఆగస్టు 6న కాచిగూడ- కాకినాడ టౌన్‌ (07039)

ఆగస్టు 17న కాకినాడటౌన్‌- కాచిగూడ (17040) రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.

అలాగే, ఆగస్టు14 నుంచి 20 వరకు హైదరాబాద్‌, సికింద్రబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో నడుస్తున్న 22 లోకల్‌ రైళ్లు రద్దు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

– లింగంపల్లి-హైదరాబాద్‌

– ఉందానగర్‌-లింగంపల్లి

– ఫలక్‌నుమా-లింగంపల్లి

రామచంద్రాపురం-ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్‌లు రద్దు చేసినట్టుగా రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

అంతేకాదు..ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఏపీలోని విజయవాడ డివిజన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ పనులు ప్రారంభించారు. ఈ కారణంగా ఆగస్టు 14 నుండి 20 వరకు ఆయా రైల్వే మార్గాల్లోని పలు రైళ్లు రద్దు చేసినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి హెచ్ రాకేష్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..