AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Machilipatnam: డాక్టర్ రాధ హత్యకేసులో ట్విస్ట్.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన పోలీసులు

Machilipatnam: దాదాపు 20 రోజులకు పైగా జరిగిన విచారణలో పోలీసులే షాక్ కు గురయ్యేలా సంచలన విషయాలు బయటపడ్డాయి. గత నెల 25న మచిలీపట్నంలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత దొరక కుండా ఉండేందుకు ప్లాన్ ప్రకారం ఆమె చుట్టూ కారం పొడి చల్లినట్టుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని అదే ఆస్పత్రిలో రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. సాయంత్రం వరకు ఏమి తెలియనట్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ డ్రామా పూర్తి చేశారు. సాయంత్రం హత్య జరిగినట్లు సృష్టించాడని..

Machilipatnam: డాక్టర్ రాధ హత్యకేసులో ట్విస్ట్.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన పోలీసులు
Doctor Radha Murder Case
P Kranthi Prasanna
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 12, 2023 | 2:29 PM

Share

మచిలీపట్నం, ఆగస్టు 12: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది…మొదటి నుండి అందరూ అనుమానిస్తున్నట్లే కట్టుకున్న భర్తే ఆమెను కడతేర్చాడు…వైద్యుడిగా ప్రాణం పోయాల్సిన భర్తే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఆస్తి తగాదాలతో భార్యను హత్య చేసిన డాక్టర్ తీరు మచిలీపట్నం ప్రజలంతా ఉలిక్కిపడేలా చేసింది. గత నెల 25న మచిలీపట్నంలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ హత్య కేసును ఛేదించారు పోలీసులు. కట్టుకున్న భర్తే భార్యను హత్య చేసి దోపిడీ దొంగల పనిగా సృష్టించే ప్రయత్నం చేసి కటకటాల పాలయ్యాడు. కృష్ణ జిల్లా మచిలీపట్నంకు చెంది ముద్దాయి డాక్టర్ మాచర్ల లోకనాధ మహేశ్వర రావు అతని భార్య రాధా ఇద్దరు వైద్యులే. కింద ఆస్పత్రి పైన ఇళ్ళు ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెల 25న పట్టపగలు మద్యాహ్నం 12:30 కిరాతకంగా డ్రైవర్ మధుతో కలిసి మహేశ్వరావు హత్య చేసి ఏమి తెలియనట్లు ఓ కథ అల్లాడు.

ఎప్పటి నుండో భార్యతో ఉన్న ఆస్తి విభేదాలతో ఎలాగైనా ఆమెను తుదముట్టించాలనుకున్నాడు మహేశ్వరావు…గత కొద్దీ రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. అదే క్రమంలో మహేశ్వరావు కార్ డ్రైవర్ ను ఎలాగైనా భార్యను హత్య చెయటానికి ప్రేరేపించాడు. రూ. 30 లక్షల డబ్బుతో పాటు డాక్టర్ ఒంటిపై బంగారం ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. పక్క ప్లాన్ తో స్కేచ్‌ వేసాడు మూడు నెలలకు ముందే సీసీ టీవీని ఆపేశాడు. వేసుకున్న ప్లాన్‌ ప్రకారం..డ్రైవర్ ను పై గదిలో దాచి మధ్యాహ్న సమయంలో వంట చేస్తున్న భార్య పై ఇద్దరూ కలిసి దాడికి దిగారు….డ్రైవర్ రాధా ను గట్టిగ పట్టుకుంటే ఆమె భర్త వెనకాల నుండి ఆక్సిజన్ సిలిండర్ బిగించే రెంచి తో తలపై పలుమార్లు కొట్టి హత్య చేసినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు. దాంతో ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాతే ఆమె చుట్టూ దొరకుడని ప్లాన్ ప్రకారం కారం చల్లినట్టుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని అదే ఆస్పత్రిలో రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. సాయంత్రం వరకు ఏమి తెలియనట్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ డ్రామా పూర్తి చేశారు. సాయంత్రం హత్య జరిగినట్లు సృష్టించాడు.

దాదాపు 20 రోజులకు పైగా జరిగిన విచారణలో పోలీసులే షాక్ కు గురయ్యేలా సంచలన విషయాలు బయటపడ్డాయి. .నిన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..ఇంకా లోతైన దర్యాప్తు చేసి హత్యకు సహకరించిన, సంబందించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారించి అనుబంద చార్జి షీటు దాఖలు చేస్తామని కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..