Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saidpur village: సైనికుల గ్రామం ఇది.. శౌర్యానికి ప్రతీకగా ఇంటికో వీరుడు…దేశం కోసం 10వేల మందిని విరాళంగా ఇచ్చి..

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటిష్ వారు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ నుండి సైనికులను విదేశీ విధుల కోసం పంపినప్పుడు, సైద్‌పూర్‌ గ్రామం నుండి, 155 మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 60 మంది విదేశాలలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. 66 మంది గ్రామానికి తిరిగి వచ్చారు. ఇప్పటివరకు సైద్‌పూర్ దాదాపు 10వేల మంది సైనికులను దేశ సేవ కోసం సమర్పించింది. గ్రామానికి చెందిన ఈ సైనికులు మొదటి ప్రపంచ యుద్ధం నుండి అనేక యుద్ధాలలో పోరాడారు.

Saidpur village: సైనికుల గ్రామం ఇది.. శౌర్యానికి ప్రతీకగా ఇంటికో వీరుడు...దేశం కోసం 10వేల మందిని విరాళంగా ఇచ్చి..
Saidpur Village
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 12, 2023 | 1:29 PM

విభిన్న విషయాలకు ప్రసిద్ధి చెందిన అనేక గ్రామాలు మన దేశంలో ఉన్నాయి. అయితే దేశ సేవలో అత్యధికంగా సహకరిస్తున్న గ్రామం ఒకటి ఉంది. అది ఉత్తరప్రదేశ్‌లోని సైద్‌పూర్ అనే గ్రామం. ఈ గ్రామం నడిబొడ్డున దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది గ్రామస్తుల పేర్లతో గర్వించదగిన స్మారక చిహ్నం కూడా ఉంది. ఇప్పటివరకు సైద్‌పూర్ దాదాపు 10వేల మంది సైనికులను దేశ సేవ కోసం సమర్పించింది. గ్రామానికి చెందిన ఈ సైనికులు మొదటి ప్రపంచ యుద్ధం నుండి అనేక యుద్ధాలలో పోరాడారు. 20,000 జనాభా ఉన్న గ్రామంలోని మొత్తం జనాభా రక్షణ దళాల మూడు శాఖలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కాకుండా.. గ్రామస్థులలో మరొక చిన్న విభాగం పోలీసు ఫోర్స్, వివిధ పారామిలటరీ విభాగాలలో పనిచేసిన, పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు.

సైద్‌పూర్ గ్రామం బులంద్‌షహర్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉంది. ప్రస్తుతం గ్రామంలో 21,000 మంది జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 2,450 మంది సైనికులుగా పనిచేస్తుండగా, 1,100 మంది ఇప్పుడు సైన్యంలో చేరారు. అదనంగా, 550 మంది గ్రామస్తులు యూపీ పోలీసు, పారామిలటరీ బలగాలతో సహా వివిధ ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటిష్ వారు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ నుండి సైనికులను విదేశీ విధుల కోసం పంపినప్పుడు, సైద్‌పూర్‌ గ్రామం నుండి, 155 మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 60 మంది విదేశాలలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. 66 మంది గ్రామానికి తిరిగి వచ్చారు.

ఇవి కూడా చదవండి

1962 నాటి చైనా-ఇండియన్ యుద్ధం, 1965, 1971 నాటి ఇండో-పాకిస్తాన్ ఘర్షణల్లో కూడా ఈ గ్రామం నుండి సైనికులు పాల్గొన్నారు. ఇప్పటికీ దేశసేవ కోసం ప్రాణాలను సైతం పక్కనబెట్టే యువకులు పల్లెల్లో నిత్యం కనిపిస్తుంటారు. ప్రతి ఇంటికి కనీసం ఒక సైనికుడు ఉండటం సైద్‌పూర్ గ్రామం ప్రత్యేకత.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..