DPDP Bill – 2023: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా బంధిత కంపెనీల భారీగా జరిమానా విధించే అధికారం చట్టం కల్పించింది. ఇక ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం..
Digital Personal Data Protection Bill – 2023: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023(DPDP)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దాంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని, ఇక ఈ బిల్లు చట్టంగా మారిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఫార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లును పరిశీలించిన రాష్ట్రపతి.. ఆమోదం తెలిపారు.
డిపిడిపి బిల్లును ఆగష్టు 7వ తేదీన లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఆ తరువాత ఆగష్టు 9వ తేదీన రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష నేతలు వ్యతిరేకించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అనుకున్న ప్రకారం ముసాయిదా బిల్లను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. రెండింటికీ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భారతదేశ పౌరుల డాటాను ఉపయోగించే విధానాన్ని నిర్దేశిస్తూ ఈ బిల్లును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా బంధిత కంపెనీల భారీగా జరిమానా విధించే అధికారం చట్టం కల్పించింది. ఇక ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. అయితే, భద్రతా కారణాలరీత్యా ప్రజల డేటాను వినియోగించుకునే అధికారం కేంద్ర సంస్థలకు ఉంటుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
వ్యక్తిగత సమాచార గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆన్‌లైన్ వేదికలు పౌరుల డేటాను అనుమతి లేకుండా వినియోగించుకోవడాన్ని నిషేధించేలా చట్టం చేయాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా 2019లోనే డిపిడిపి ముసాయిదా బిల్లును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. 33 పేజీలతో రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌పై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించారు. ఆ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..