Health tips : గ్రీన్‌గోల్డ్‌గా పిలిచే ఈ సూప‌ర్ ఫుడ్ తో కలిగే అద్భుత ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

Avocado Health Benefits: అవ‌కాడోతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అన్నీఇన్నీ కావు.. ఇందులో ఉండే విట‌మిన్ సీ, ఈ, కే, బీ6తో పాటు రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, లుటిన్‌, బీటా కేర‌టిన్‌, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అవకాడో తినడం చాలా శ్రేయస్కరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్‌ గోల్డ్‌గా పిలుచుకునే ఈ పండులో అనేకమైన పోషకాలు ఉంటాయి. అవీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీరు అవకాడోలను ఎందుకు తినాలో ఇక్కడ కొన్ని కారణాలు, ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Aug 12, 2023 | 12:46 PM

కొలెస్ట్రాల్: అవకాడోలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇందుకోసం రోజూ ఒక అవకాడో పండును తినడం మంచిది.

కొలెస్ట్రాల్: అవకాడోలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇందుకోసం రోజూ ఒక అవకాడో పండును తినడం మంచిది.

1 / 5
Healthy For Heart- గుండె: 
వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Healthy For Heart- గుండె: వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

2 / 5
Good For Vision- కంటి ఆరోగ్యం- యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అవకాడోలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.

Good For Vision- కంటి ఆరోగ్యం- యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అవకాడోలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.

3 / 5
Improves Digestion- వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.  ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Improves Digestion- వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

4 / 5
Good For Skin- అవకాడోలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం దృఢత్వం, స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడతాయి.  అవకాడో తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గడంతోపాటు బరువు తగ్గవచ్చు.

5 / 5
Follow us