'ఉస్తాద్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయిga. తాను, తన పెద్దన్న కీరవాణి కష్టపడి పైకి వచ్చామన్నారు. ఆ కథలు వింటూ పెరిగిన శ్రీసింహా, తమలాగే ప్రయాణం మొదలుపెట్టారని చెప్పారు. అబ్బాయిలు తమ ఫస్ట్ బైక్‌ని అసలు మర్చిపోరని, 'ఉస్తాద్'లో... బైక్‌నీ, విమానాన్ని కలిపిన తీరు బావుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నానితో పాటు పలువురు పాల్గొన్నారు.