Movie Updats: టాలీవుడ్ టు బాలీవుడ్.. నాయా మూవీస్ క్రేజీ అప్డేట్స్..
ఇప్పటికీ కమల్‌హాసన్ ఓపిగ్గా అన్నీ సినిమాలూ చూస్తారని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. తాను చూసిన సినిమాల్లోని సన్నివేశాలను, డైలాగులను, బీజీఎంలనూ గుర్తుంచుకుంటారని అన్నారు. పలు సందర్భాల్లో ఆయన చెప్పే మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందని అన్నారు. కమల్ లాగా అన్ని సినిమాలు చూసే ఓపిక తనకు లేదని అన్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Rajeev Rayala
Updated on: Aug 12, 2023 | 3:15 PM

లక్ష్మీమీనన్‌ని విశాల్ త్వరలో పెళ్లి చేసుకుంటారని ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అందులో నిజం లేదని అన్నారు హీరో విశాల్. తన గురించి వచ్చిన గాసిప్పుల గురించి ఇప్పటిదాకా ఎప్పుడూ స్పందించలేదని అన్నారు. అయితే, ఇంకో అమ్మాయి పేరు ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఇప్పుడు స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. తన పెళ్లి బర్ముడా ట్రయాంగిల్ కాదని, డీకోడ్ చేయక్కర్లేదని ట్వీట్ చేశారు

ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే జంటగా నటించిన సినిమా డ్రీమ్ గర్ల్ 2. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ కామెడీ డ్రామాలో పూజా అనే లేడీ కేరక్టర్‌లో నటిస్తున్నారు ఆయుష్మాన్ ఖురానా. తాను రేడియోలో పనిచేసేటప్పుడు అమ్మాయిలాగా సరదాగా మాట్లాడటం వల్ల, పూజా కేరక్టర్‌కి డబ్బింగ్ చెప్పడం తేలికైందని అన్నారు ఆయుష్మాన్. ఫస్ట్ పార్టుతో పోలిస్తే లేటెస్ట్ వెర్షన్ కడుపుబ్బ నవ్విస్తుందని చెప్పారు.

ఇప్పటికీ కమల్‌హాసన్ ఓపిగ్గా అన్నీ సినిమాలూ చూస్తారని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. తాను చూసిన సినిమాల్లోని సన్నివేశాలను, డైలాగులను, బీజీఎంలనూ గుర్తుంచుకుంటారని అన్నారు. పలు సందర్భాల్లో ఆయన చెప్పే మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందని అన్నారు. కమల్ లాగా అన్ని సినిమాలు చూసే ఓపిక తనకు లేదని అన్నారు.

అక్షయ్‌కుమార్‌కి చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింది. ఆయన నటించిన ఓ మై గాడ్ 2కి మంచి స్పందన వస్తోంది. ఆకట్టుకునే కథ, సాలిడ్ డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయని అంటున్నారు క్రిటిక్స్. కోర్టు రూమ్ సీక్వెన్స్ బావుందని మెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టంట్‌గా క్లిక్ అయ్యే కమర్షియల్ సినిమా కాదని, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల మంచి కలెక్షన్లు రావచ్చని ముంబై టాక్.

మర్యాదపురుషోత్తముడి పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. సీతమ్మ తల్లిగా కృతి సనన్ నటించారు. ఈ సినిమా థియేటర్లలో పలు రకాల విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో సినిమాల వ్యూస్ గురించి అందరూ గర్వంగా చెప్పుకుంటున్న రోజుల్లో, ఆదిపురుష్‌ని చడీ చప్పుడు కాకుండా విడుదల చేయడమేంటని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.





























