AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగు కార్లను ఢీకొన్న ట్రక్కు.. ఆపై ఆగివున్న లారీని..

భారీ ట్రక్కు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చి కార్లను ఢీకొట్టిన క్రమంలో... అవి ఎగురుతూ ముందుకు పడుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ ట్రక్కు బ్యాలెన్స్ కంట్రోల్‌ తప్పింది.. ముందు నుంచి వెనుకకు తిరిగిన ట్రక్కు... బోల్తాపడిన కార్లపైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. ధ్వంసమైన కార్ల పరిస్థితి చూస్తే గూస్‌బంప్స్‌ వచ్చాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, వినియోగదారులు విభిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Watch: ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగు కార్లను ఢీకొన్న ట్రక్కు.. ఆపై ఆగివున్న లారీని..
Speed Truck Collided
Jyothi Gadda
|

Updated on: Aug 12, 2023 | 11:45 AM

Share

Road Accident Video: రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చాలాసార్లు ముందు నుంచి వస్తున్న వాహనం ప్రమాదానికి గురవుతోంది. తాజాగా అలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో భయానకంగా ఉంది. రద్దీగా ఉండే రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు నాలుగు వాహనాలను ఒక్కసారిగా ఢీకొట్టింది. ఘోర ప్రమాదం వీడియో అందరినీ భయపెడుతుంది. అతి వేగంతో వస్తున్న ట్రక్కు నాలుగు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి గురైన కార్లన్నీ నుజ్జు నుజ్జుగా ధ్వంసమయ్యాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఒకదాని తర్వాత మరొకటి కార్లను ఢీకొడుతూ పోయింది. ఈ వీడియో మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమై ప్రస్తుతం వైరల్‌గా మారింది.

నాలుగు కార్లను ఢీకొట్టిన హైస్పీడ్ ట్రక్…

రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వాహనాల్లో కూర్చున్న వారికి మరుసటి క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంతలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఎదురుగా ఉన్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది. హైస్పీడ్‌ ట్రక్‌ బలంగా ఢీకొనడంతో ఎదురుగా ఉన్న వాహనాలు ఎగిరిపోయి రోడ్డు నిండా దుమ్ము రేగుతోంది. వాహనాలన్నీ బొమ్మల్లా ముక్కలైపోయాయి. ఈ వాహనాలను ఢీ కొట్టిన తర్వాత ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనను చూసిన జనం షాక్‌తో వణికిపోయారు. ట్రక్కు ఢీకొన్న కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ భయానక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. చూస్తుండగానే… ట్రక్కు వెనుక నాలుగు కార్లు ఇరుకైన రోడ్డులో నెమ్మదిగా కదులుతున్నాయి. అసలే ముందు భారీగా ట్రామ్‌ జామ్ ఏర్పడి ఉండటం వల్ల వాహనాలన్నీ నెమ్మదిగా కదులుతున్నాయి. అప్పుడు వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు నాలుగు కార్లను ఢీకొట్టి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లన్నీ ఎగురుతూ ఒకదానిపై ఒకటి బోల్తా కొట్టాయి. అన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేగంగా వస్తున్న ట్రక్కు.. ఆఖరులో లారీని ఢీకొట్టడంతో కార్లన్నీ బొమ్మ కార్లల పగిలిపోయాయి.

ఇవి కూడా చదవండి

వరుస వాహనాలను ఢీకొట్టిన భారీ ట్రక్కు…

భారీ ట్రక్కు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చి కార్లను ఢీకొట్టిన క్రమంలో… అవి ఎగురుతూ ముందుకు పడుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ ట్రక్కు బ్యాలెన్స్ కంట్రోల్‌ తప్పింది.. ముందు నుంచి వెనుకకు తిరిగిన ట్రక్కు… బోల్తాపడిన కార్లపైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. ధ్వంసమైన కార్ల పరిస్థితి చూస్తే గూస్‌బంప్స్‌ వచ్చాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, వినియోగదారులు విభిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌