Tomato Ice Cream: టమాటో ఐస్‌ క్రీమ్‌..! ఎలా చేయాలో మీకు తెలుసా..? తయారీ వీడియో వైరల్‌..

మిశ్రమాన్ని ఐస్ క్రీం రోల్స్‌లా తయారు చేశాడు. తయారైన ఐస్‌క్రీం రోల్స్‌ను ఒకదానిపై ఒకటి సర్వింగ్‌ ప్లేట్‌లో పేర్చాడు. దాని పై నుండి మళ్లీ కారామెల్‌, తరిగిన టమాటా ముక్కలు వేసి సర్వ్‌ చేస్తున్నాడు. పైగా అతడు ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే సరిపోతుందని అంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. చాలా మంది నెటిజన్లు ఈ టమాటా ఐస్‌క్రీమ్‌పై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపరీత చేష్టల వల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

Tomato Ice Cream: టమాటో ఐస్‌ క్రీమ్‌..! ఎలా చేయాలో మీకు తెలుసా..?  తయారీ వీడియో వైరల్‌..
Tomato Ice Cream
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 12, 2023 | 9:00 AM

Tomato Ice Cream Video: స్ట్రీట్ ఫుడ్ వెరైటీలు ప్రజలకు ఎంతగానో నచ్చుతాయి. తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల వద్ద లభించే ఒక్క ఐటమ్ ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తయారు చేస్తారు. అందుకే వాటి టేస్ట్‌ ఎక్కడి కక్కడ భిన్నంగా ఉంటాయి. అంతేకాదు.. కొత్త కొత్త వెరైటీ ఫుడ్స్ కనిపెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇక్కడ ఓ వీధి వ్యాపారి ఎప్పుడూ చూడని వెరైటీ వంటకం తయారు చేస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఈ టమాటా ఐస్‌క్రీం చూసేందుకు మాత్రం అచ్చం అందరికీ ఇష్టమైన ఐస్‌ క్రీంలాగానే ఉంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టమాటాతో ఐస్ క్రీమా అని అవాక్కవుతున్నారు. ?

టమాటా ఐస్ క్రీం తయారీ ఎలాగంటే..

ఫుడ్ వ్లాగర్, @aapkabhai_foody ద్వారా వెళ్ళే రాజన్ మిశ్రా ఢిల్లీలో టొమాటో ఐస్ క్రీం తయారు చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ విక్రేత వీడియోను షేర్ చేసారు. ఈ వీడియో వాస్తవానికి మేలో పోస్ట్ చేయబడింది. కానీ, ఇది ప్రస్తుత టమోటా ధరల నేపథ్యం, సమస్యల కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, స్ట్రీట్ ఫుడ్ విక్రేత టమాటాతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేశాడో చూస్తే.. ముందుగా తరిగిన టమాటాను మధ్యలో పెట్టి.. అతను దాని చుట్టూ కారామెల్ సాస్ పోస్తాడు. ఆ తరువాత తరిగిన టమాటా పైన పాలు పోసి, అన్ని పదార్ధాలను బాగా కలిపేశాడు. ఆ మిశ్రమానంత బాగా కలిపి మంచి క్రీమ్‌లా తయారు చేశాడు. ఆ తరువాత, మిశ్రమాన్ని ఐస్ క్రీం రోల్స్‌లా తయారు చేశాడు. తయారైన ఐస్‌క్రీం రోల్స్‌ను ఒకదానిపై ఒకటి సర్వింగ్‌ ప్లేట్‌లో పేర్చాడు. దాని పై నుండి మళ్లీ కారామెల్‌, తరిగిన టమాటా ముక్కలు వేసి సర్వ్‌ చేస్తున్నాడు. పైగా అతడు ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే సరిపోతుందని అంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసి నెటిజన్ల స్పందన..

చాలా మంది నెటిజన్లు ఈ టమాటా ఐస్‌క్రీమ్‌పై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపరీత చేష్టల వల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఈ రుచికరమైన ఐస్ క్రీం తినడానికి పావ్ కావాలని మరొకరు చమత్కరించారు. ఆ తర్వాత మరో నెటిజన్ ‘వెల్‌కమ్ టు ఇండియా’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఐస్‌క్రీమా లేదా బుర్జియా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. రోటీతో ఐస్‌క్రీమ్‌ ఎలా తీసుకుంటారని మరో నెటిజన్‌ ​​ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!