Viral Video: వాహ్..ఏం టాలెంట్ గురూ..! బైక్‌ను కారుగా మార్చి భలేగా చేశావే..ఇంజనీర్లు కూడా బలాదూరే..
ఇంకేం కారు కానీ, కారును.. ప్రజలందరూ వింతగా చూస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట కూడా బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లు, వ్యూస్‌తో హల్‌చల్ చేస్తోంది. బైక్‌తో తయారు చేసిన వింత కారు వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏం టాలెంట్ గురూ..మీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా బలాదూర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలంటూ మరికొందరు ట్విట్ చేశారు.
మన దేశంలో జుగాడ్ టాలెంట్‌కు కొదవే లేదు. విచ్చలవిడి ఇంటర్‌నెట్ వినియోగం అందుబాటులోకి రావటంతో సోషల్ మీడియా వేదికగా ఎక్కడెక్కడో ఉన్న సృజనాత్మక వ్యక్తులు ఈ ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అలాంటి జుగాడ్‌లు తమలోని తెలివి తేటలకు పదును పెడుతూ.. అద్భుతమైన ఆవిష్కరణలు, ఐడియాలతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. సాధారణ బైకును కారులా మార్చేస్తూ ఇప్పటికే కొందరు హల్‌చల్ చేయగా, తాజాగా అలాంటిదే మరో బైక్ కారు తయారు చేశారు మరో తెలివైన వ్యక్తి. అతడి తెలివి తేటలతో బైకను వెనుక నుంచి చూస్తే..కారులా, ముందు నుంచి చూస్తే.. ఒకే టైర్‌తో నడుస్తున్న ఆటోలా దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం కారులా కనిపించే అద్భుత సృష్టి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఓ వ్యక్తి తన బైకును ఏకంగా కారులా మార్చేశాడు. చూసేందుకు అది ఏ మాత్రం బైకులా అనిపించటం లేదు..అచ్చం కారు లాగానే మార్చేశాడు. ఇందుకోసం బైక్‌కు కారు బాడీని అమర్చాడు. బైకు టైర్లు కాకుండా దానికి మరోవైపు మూడో టైరును ఏర్పాటు చేశాడు. అలాగే బైకు పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా సీట్లు కూడా అమర్చాడు. దీంతో ఆ బైకు రూపు రేఖలు పూర్తిగా మారిపోయింది. వెనుక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా అచ్చం కారులా కనిపిస్తుంది. ఇదేం బైకు కాదు.. కారే అన్నట్టుగా..కారుకు ఏమాత్రం తీసిపోని విధంగా మార్చేశాడు. అంతేకాదు.. కారుకు డిక్కీ ఉన్నట్టుగా వెనుక వైపు లగేజీ పెట్టుకునేందుకు కూడా ప్రత్యేకించి డిజైన్ చేశాడు. ఇంకేం కారు కానీ, కారును.. ప్రజలందరూ వింతగా చూస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట కూడా బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది.
View this post on Instagram
ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లు, వ్యూస్‌తో హల్‌చల్ చేస్తోంది. బైక్‌తో తయారు చేసిన వింత కారు వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏం టాలెంట్ గురూ..మీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా బలాదూర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలంటూ మరికొందరు ట్విట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..