- Telugu News Photo Gallery Health you should also know these 6 tremendous benefits of eating ashwagandha powder Telugu News
Ashwagandha: కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ వాడితే కలిగే 6 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
అశ్వగంధ ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో చికిత్స కోసం ఉపయోగిస్తున్న ఒక రకమైన ఆయుర్వేద మూలిక. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే, ఇవన్నీంటికి సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది అశ్వగంధ. ఈ మూలికను సంవత్సరం మొత్తం తీసుకున్నా కూడా మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా అశ్వగంధ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Updated on: Aug 11, 2023 | 12:36 PM

మీరు నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే, మీరు అశ్వగంధ పొడిని తీసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. అశ్వగంధ పొడిని పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మేలు జరుగుతుంది.

కీళ్ల నొప్పులు లేదా వాపుతో బాధపడుతున్నవారు అశ్వగంధ పొడిని తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండి.. మీరు పదే పదే అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కూడా మీరు అశ్వగంధ పొడిని తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీనితో మీరు అనేక వ్యాధులను నివారించవచ్చు.

అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. కండరాలలో నొప్పి తగ్గుతుంది. కండరాలు లాగటం వంటి సమస్య నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. అశ్వగంధ చాలా శక్తివంతమైన ఔషధం, ఇది పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తుంది.

అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది.





























