Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. అటాక్ చేసింది చిరుతనే..

తిరుమల నడక మార్గంలో పిల్లలకు భరోసా లేదు. పిల్లలతో నడకమార్గంలో వెళ్తున్న వాళ్లు వెయ్యికళ్లతో వాళ్లను కనిపెట్టుకునే ఉండాలి. లేదంటే లక్షిత తరహాలో ఏమైనా జరగొచ్చు. జూన్ 23న చిరుత దాడి నుంచి కౌశిక తప్పించుకోగలిగాడు. పిల్లిని తరుముకుంటూ వచ్చిన చిరుత.. చేతికి అందిన కౌశిక్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తం కావడంతో బతికి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు లక్షిత కథ వేరు. పెద్దలు బిస్కెట్లు కొనేందుకు అలా షాప్‌కి వెళ్లారో లేదో ఇలా..

Andhra Pradesh: చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. అటాక్ చేసింది చిరుతనే..
Leopard Attack On Lakshitha
Follow us
Shiva Prajapati

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 12, 2023 | 7:45 PM

తిరుపతి, ఆగష్టు 12: తిరుమల నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత మృత దేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. లక్షిత మృతికి చిరుతే కారణం తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. చిరుతే దాడి చేసినట్లు పోలీసులకకు స్పష్టం చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిపుణులు. లక్షితను చిరుత చంపి తిన్నట్లు నిర్ధారించారు. తల భాగంపై అటాక్ చేసిన చిరుత.. ఆ తల భాగాన్ని తినేసినట్లు తెలిపారు. ఇక పోస్టుమార్టం అనంతరం అనంతరం లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీ నుంచి నెల్లూరుకు తరలించారు. కాగా, లక్షిత మృతితో ఇటు కుటుంబంలో, అటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రుయా ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. టీటీడీ, ఫారెస్ట్ అధికారుల తీరును తప్పుపట్టారు లక్షిత తల్లి. వన్య మృగాలు వరుసగా దాడులు చేస్తుంటే.. మెట్ల మార్గాన్ని ఎందుకు మూసివేయడం లేదని ప్రశ్నించారు. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని లక్షిత తల్లి కన్నీరుమున్నీరయ్యింది. తమ బిడ్డ మృతికి అధికారుల తీరే కారణమని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. భద్రతా చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక చిన్నారి లక్షిత తిరిగి రాదని తెలిసి పుట్టెడు దుఖంతో గుండెలవిసేలా రోధిస్తోంది ఆ చిన్నారి తల్లి.

తిరుమల అడవిలో పెరిగిన చిరుతల సంఖ్య..

టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం.. తిరుమల అడవిలో చిరుత పులుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చిరుతల కదలికలను గుర్తించామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై మూడు రోజుల క్రితమే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అంతలోనే లక్షితపై చిరుత ఎటాక్ చేయడం తీవ్ర కలకం రేపింది. ఇక ఇలాంటి దాడులను నియంత్రించలేమా? అంటే సాధ్యం కాదంటోంది టీటీడీ. వన్యప్రాణులను కట్టడి చేయలేమని చెప్పేస్తున్నారు టీటీడీ అధికారులు. అది తమ పని కూడా కాందని చేతులు దులిపేసుకుంటున్నారు అధికారులు. ఇక దారికి అటూ ఇటూ గ్రిల్స్ పెట్టడంపై కూడా తర్జన భర్జన పడుతున్నారు అధికారులు. ఇలా చేయడానికి వన్యప్రాణ చట్టాలు అడ్డొస్తున్నాయని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు.

పిల్లలతో వెళ్తున్న పెద్దలూ బాధ్యత మీదే!

తిరుమల నడక మార్గంలో పిల్లలకు భరోసా లేదు. పిల్లలతో నడకమార్గంలో వెళ్తున్న వాళ్లు వెయ్యికళ్లతో వాళ్లను కనిపెట్టుకునే ఉండాలి. లేదంటే లక్షిత తరహాలో ఏమైనా జరగొచ్చు. జూన్ 23న చిరుత దాడి నుంచి కౌశిక తప్పించుకోగలిగాడు. పిల్లిని తరుముకుంటూ వచ్చిన చిరుత.. చేతికి అందిన కౌశిక్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తం కావడంతో బతికి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు లక్షిత కథ వేరు. పెద్దలు బిస్కెట్లు కొనేందుకు అలా షాప్‌కి వెళ్లారో లేదో ఇలా ఓ వన్యమృగం నోటకరుచుకువెళ్లిపోయింది. అడవిలోకి లాక్కెళ్లి తలభాగం తినేసింది. ఇప్పటి వరకు అది చిరుతా? ఎలుగుబంటా? అనే సందేహం ఉండగా.. ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం లక్షితపై అటాక్ చేసింది చిరుతపులే అని తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..