AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భర్త చనిపోయి ఐదేళ్లు.. పాప వయసు ఏడాది.. తనకే పుట్టిందంటూ పోలీసులతో వాదన.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆమె భర్త చనిపోయి 5 ఏళ్లు అవుతుండగా.. పాప వయసు మాత్రం 18 నెలలే. ఈ గ్యాప్‌ ఆధారంగా గట్టిగా నిలదీస్తు అసలు మ్యాటర్ అంతా రివీల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బిందెల కాలనీలో నివాసం ఉంటున్న మారెక్క, పరశురాం దంపతులకు నలుగురు కుమార్తెలు. మారెక్క దంపతులు బిందెల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మారెక్కకు కొద్ది రోజుల క్రితం అదే ఏరియాలో..

Andhra Pradesh: భర్త చనిపోయి ఐదేళ్లు.. పాప వయసు ఏడాది.. తనకే పుట్టిందంటూ పోలీసులతో వాదన.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..
Representative Image
Nalluri Naresh
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 12, 2023 | 11:13 AM

Share

అనంతపురం, ఆగష్టు 12: సంవత్సరన్నర పాప కిడ్నాప్ కధ సుఖాంతం అయ్యింది. చిన్నారిని కిడ్నాప్ చేసి.. తనకు పుట్టిన బిడ్డ అని మహిళ బుకాయించింది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆమె భర్త చనిపోయి 5 ఏళ్లు అవుతుండగా.. పాప వయసు మాత్రం 18 నెలలే. ఈ గ్యాప్‌ ఆధారంగా గట్టిగా నిలదీస్తు అసలు మ్యాటర్ అంతా రివీల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బిందెల కాలనీలో నివాసం ఉంటున్న మారెక్క, పరశురాం దంపతులకు నలుగురు కుమార్తెలు. మారెక్క దంపతులు బిందెల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మారెక్కకు కొద్ది రోజుల క్రితం అదే ఏరియాలో ఉంటున్న మంజుల అనే మహిళ పరిచయం అయ్యింది. మారెక్కతో పరిచయం పెంచుకున్న మంజుల తరచూ ఆమె ఇంటికి వద్దకు వచ్చి గంటల తరబడి మాట్లాడేది. అలా వారి స్నేహం ఏర్పడింది. ఆ చనువుతో మారెక్క 18 నెలల పాప జ్యోతిని మంజుల కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.

పాపను ఆడిస్తానని తీసుకెళ్ళిన మంజుల ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు చిన్నారి తల్లిదండ్రులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటలోపే పాపను కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించారు. కిడ్నాపర్ మంజుల గుంతకల్లు పట్టణంలో ఉందని సమాచారం తెలియడంతో.. గుంతకల్ పోలీసులకు తాడిపత్రి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే గుంతకల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. గుంతకల్లు పోలీస్ స్టేషన్లో కిడ్నాపర్ మంజుల మాట్లాడుతూ.. ఈ పాప తనకు పుట్టిన కూతురు అని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తన దగ్గర బిడ్డకు ఇచ్చేందుకు పాలు లేక తమ పెద్దమ్మ వాళ్లకు పాపను ఇచ్చానని పోలీసులను బుకాయించింది.

దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. అసలు విషయం బయటపడింది. మంజులకు వివాహమై.. 5సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. భర్త లేకుండా పాప ఎలా పుట్టిందని పోలీసులు ఆశ్చర్యపోయారు. అదే విధంగా మంజుల పొంతనలేని సమాధానం చెబుతుండడంతో.. పాపను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. గుంతకల్లు పోలీసులు కిడ్నాపర్ మంజులను, పాప జ్యోతిని తాడిపత్రి పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. మంజుల డబ్బుల కోసమే పాపను కిడ్నాప్ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. కిడ్నాప్ కు గురైన పాప జ్యోతిని తల్లిదండ్రులు మారెక్క, పరుశురాములకు పోలీసులు అప్పగించారు. దీంతో పాప కిడ్నాప్‌లో చోటు చేసుకున్న హైడ్రామా మిస్టరీ వీడిపోయింది. కిడ్నాపర్ మంజుల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..