Andhra Pradesh: ‘అయ్యో కుక్కా.. అప్పుడే వెళ్లిపోయావా’.. సంస్మరణ సభకు తరలి వచ్చిన వందలాది మంది..

చనిపోగానే కుటుంబ సభ్యులు, సమాజం ఎలా ఫీలయ్యారు అనేది ఆ జీవి మరణించడానికి ముందు చేసిన మంచి పనులు, నడవడి మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి కాలం చేయగానే కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు తలచుకుని తీవ్రంగా రోదిస్తారు. బంధువులు, మిత్రులు కలిసినప్పుడల్లా కనీసం మాటలు సందర్భంలోనైనా తలుచుకుంటారు. మత సాంప్రదాయాలు ప్రకారం అందరూ కలిసి మ్రృతి చెందిన వ్యక్తిని మననం చేసుకుంటారు. ఆ వ్యక్తి సంఘ సేవకుడు, నాయకుడు అయితే ఆయా పార్టీలు సంతాప సభలు నిర్వహిస్తాయి. మరి చని పోయిన జీవి ఒక జంతువు అయితే దానికి..

Andhra Pradesh: ‘అయ్యో కుక్కా.. అప్పుడే వెళ్లిపోయావా’.. సంస్మరణ సభకు తరలి వచ్చిన వందలాది మంది..
Memorial Service To Dog
Follow us
B Ravi Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 12, 2023 | 10:23 AM

ఏలూరు, ఆగష్టు 12: సృష్టిలో పుట్టిన ప్రతి జీవి గిట్టడం కామన్. మరి బ్రతికినంత కాలం ఎలా ఉన్నాము. చనిపోగానే కుటుంబ సభ్యులు, సమాజం ఎలా ఫీలయ్యారు అనేది ఆ జీవి మరణించడానికి ముందు చేసిన మంచి పనులు, నడవడి మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి కాలం చేయగానే కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు తలచుకుని తీవ్రంగా రోదిస్తారు. బంధువులు, మిత్రులు కలిసినప్పుడల్లా కనీసం మాటలు సందర్భంలోనైనా తలుచుకుంటారు. మత సాంప్రదాయాలు ప్రకారం అందరూ కలిసి మ్రృతి చెందిన వ్యక్తిని మననం చేసుకుంటారు. ఆ వ్యక్తి సంఘ సేవకుడు, నాయకుడు అయితే ఆయా పార్టీలు సంతాప సభలు నిర్వహిస్తాయి. మరి చని పోయిన జీవి ఒక జంతువు అయితే దానికి ఇవన్నీ ఎవరు చేస్తారు. చాలా మంది భూమిలో కప్పెట్టి వదిలేస్తారు లేదంటే ఊరికి దూరంగా పడవేస్తారు. తల్లి దండ్రులు నే అనాధశరణాలయాల్లో వదిలేస్తున్న ఈరోజుల్లో ఒక కుక్క ఘనంగా అంత్యక్రియలు జరగటమే కాదు సంస్మరణ సభ జరిగింది.

కుక్కకు సంతాప సభ..

వినటానికి ఇది కొంచెం విచిత్రంగా ఉండవచ్చు. కాని మనిషి ప్రకృతిని ప్రేమించి ప్రక్రృతితో కలిసి జీవిస్తున్నపుడు పశు, పక్ష్యాదులను ప్రేమించటం తన అవసరాల, కోసం వాటిని మచ్చిక చేసుకుని వాటితో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రాతియుగం నుంచి మనిషికి కుక్క ఒక విశ్వాస పాత్రమైనదిగా తనతో కలిసి పోయింది. తమ ఒంటరి తనం పోగొట్టు కోవడానికి, రక్షణ కోసం, ఇంటికి కాపలా తమ అవసరాలకు తగిన జాతిని ఎంచుకుని కుక్కలను ప్రజలు పెంచుకుంటున్నారు. ఇక వాస్తు దోషం ఏమైనా ఉన్పా , అనారోగ్యంతో బాధ పడుతున్నా ఆ ఇంట్లో వాళ్లకు కలగాల్సిన నష్టం ముందుగా ఆ ఇంట్లో పెంచుకునే జంతువులపై ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే కుక్కకు మనిషికి సాధ్యం కాని గ్రహణశక్తి ఉంది. చీకట్లోనూ చిన్న అలికిడి అయినా అవి గ్రహిస్తాయి. వాసన పసిగట్టి దొంగలను పట్టుకుంటాయి. అంతేకాకుండా భూకంపాలు వంటి ప్రమాదాలను ముందుగానే వాటికి ఉన్న సామర్ధ్యం తో తెలుసుకోగలుగుతాయని చెబుతారు. ఇన్ని ప్రత్యేకతలు మనిషికి సేవ చేసే, సహాయం చేసే లక్షణాలు ఉన్న కుక్క సేవలను గుర్తు చేసుకోవడం దాన్ని పెంచుకునే వారికి కృతజ్ఞతాపూర్వకమే కదా.!

ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు..

ఇదే జరిగింది పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు మండలం పెనుమదంలో. ఇటీవల గ్రామానికి చెందిన రాంబాబు తన పెంపుడు కుక్క సాయి మ్రృతి చెందటంతో దాని 11వ రోజును ఘనంగా నిర్వహించారు. పెంపుడు కుక్కకు సంస్మరణ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులకు బోజనాలు ఏర్పాటు చేశారు. గత 15 ఏళ్ళ క్రితం బంధువుల వద్ద నుంచి కుక్క పిల్లను తెచ్చుకుని సాయి అని పేరు పెట్టుకున్నాడు రాంబాబు. అది చనిపోవటం తో హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్ని కార్యక్రమలు చేసి గ్రామంలో పెద్దలకు భోజనాలు పెట్టాడు రాంబాబు. ఇక తన ఇంటి వద్ద పెంపుడు కుక్క అయిన సాయి ఫోటో ఏర్పాటు చేసి సంతాప సభను నిర్వహించారు. ఈ సమయంలో ఆ కుక్క బ్రతికి ఉన్నప్పుడు తమను ఎలా గుర్తించేది, ఎలా మసలు కునేదో తలచుకున్నారు అందరూ. అందరూ ఉండి కొందరు మనుషులు అనాధల్లా కాలం చేస్తుంటే మూగజీవికి దాని మరణం తర్వాత ఇలా అంతిమ సంస్కారాలు, సంస్మరణ కార్యక్రమం జరగటం విశేషమే. అందుకే బ్రతికినంత కాలం నలుగురితో మంచి అనిపించుకోవాలని చెబుతారు పెద్దలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!