Andhra Pradesh: ఆ ఎమ్మెల్యేకి ఇక జైలేనా? అప్పీల్‌కు వెళ్తానన్న ఎమ్మెల్యే.. ఆస్తికరంగా విశాఖ రాజకీయాలు..!
ఆయన ఎమ్మెల్యే కాక ముందు ఒక వ్యక్తి పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. దాదాపు 15 ఏళ్లు విచారణ అనంతరం ఆయనకు జైలు శిక్ష పడింది. ఆ సమయానికి ఆయన ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కోర్టు లో తనను క్షమించి శిక్ష వేయిద్దంటూ వేడుకున్నా జడ్జ్ మాత్రం కేసు మెరిట్స్ పైనే వెళ్తున్నట్టు స్పష్టం చేస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది ధర్మాసనం. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఓ దాడి కేసుకు సంబంధించి ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
విశాఖపట్నం, ఆగష్టు 12: ఆయన ఎమ్మెల్యే కాక ముందు ఒక వ్యక్తి పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. దాదాపు 15 ఏళ్లు విచారణ అనంతరం ఆయనకు జైలు శిక్ష పడింది. ఆ సమయానికి ఆయన ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కోర్టు లో తనను క్షమించి శిక్ష వేయిద్దంటూ వేడుకున్నా జడ్జ్ మాత్రం కేసు మెరిట్స్ పైనే వెళ్తున్నట్టు స్పష్టం చేస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది ధర్మాసనం.
విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఓ దాడి కేసుకు సంబంధించి ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 6 నెలల జైలుశిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే క్రింది కోర్టు తీర్పును వాసుపల్లి గణేష్‌కు హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు.
2006 లో దాడి కేసు నమోదు..
2006 నుంచి విశాఖపట్నానికి చెందిన రామచంద్రారెడ్డి, దుర్గారెడ్డి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్న సమయంలో కొట్లాటలు కూడా జరిగాయి. 2008 అక్టోబర్ 29న ఆస్తి విబేధాల విషయంలో రామచంద్రారెడ్డిపై వాసుపల్లి గణేష్, దుర్గారెడ్డి ఇద్దరూ కలిసి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తనపై దాడి చేశారంటూ వాసుపల్లి, దుర్గారెడ్డిపై పోలీస్ స్టేషన్ దాకా వ్యవహారం వెళ్ళింది. కేసు నమోదైంది. కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి.
ఆ దాడి సమయంలో తాను అక్కడ లేనని, అసలు ఆ దాడికి నాకు సంబంధం లేదని వాసుపల్లి గణేష్ చెబుతున్నప్పటికీ, ప్రాసిక్యూషన్ మాత్రం దాడిలో ఉన్నట్లు రుజువు కావడంతో వాసుపల్లి గణేష్‌తో పాటు దుర్గారెడ్డికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు.
అప్పీల్‌కు వెళ్ళాలని నిర్ణయం..
ఈ కేసులో శిక్ష వేయకుండా జరిమానాతో సరిపెట్టమని ఎమ్మెల్యే వాసుపల్లి జడ్జిని ప్రాదేయపడ్డారు. అయితే ఈ అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు. వాసుపల్లితో పాటు ఏ 1 గా వున్న ప్రధాన ముద్దాయి బోరా దుర్గారెడ్డికి కూడా ఆరు నెలల జైలును కోర్ట్ విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా కోర్టు వెల్లడించింది. దీంతో పై కోర్టు కు అప్పీల్ కు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే టీవీ9 కి తెలిపారు. కాగా, 2019 లో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ ఆ తర్వాత వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..