Watch: మెట్రోలో వింత విన్యాసాలు.. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ప్రయాణికులు..

సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి భిన్న కామెంట్స్‌, లైకులు, షేర్లతో వైరల్‌గా మారింది. టిక్-టాక్ నిర్మూలించిన తర్వాత కొత్తగా రీల్స్-19 అనే కొత్త రకం ఇంటర్నెట్ వైరస్ ఇప్పుడు ప్రజల్ని వెంటాడుతోంది. ఆన్‌లైన్‌లో ఫేమస్‌ అవ్వాలనే కోరిక ఉన్న, పిచ్చిగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వారికి లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్‌లు లేవు. వారిక తోచిన పిచ్చి పనులు, వింత చేష్టలు చేస్తూ చెలరేగిపోతున్నారు.

Watch: మెట్రోలో వింత విన్యాసాలు.. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ప్రయాణికులు..
Delhi Metro
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 12, 2023 | 2:48 PM

గతంలో మెట్రో రైళ్లలో విచిత్రమైన, అసాధారణమైన చేస్తూ ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిన అనేక రకాల వీడియోలను మనమందరం చూశాము. ఫన్నీ ఫైటింగ్స్‌ నుండి డ్యాన్స్ వరకు, హై-వోల్టేజ్ డ్రామా అనేక వైరల్‌ ఇన్సిడెంట్స్‌ ఎన్నో చూశాము. భారతదేశం అంతటా మెట్రో రైలు కేవలం రవాణాకు మాత్రమే కాకుండా అనేక సోషల్ మీడియా పాపులర్‌ పనులు చేసుకునే ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. మెట్రో స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లపై జరిగే విచిత్ర విచిత్ర పనుల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీటన్నింటి మధ్య, ఒక కొత్త వైరల్ వీడియో మరోకటి సోషల్‌ మీడియా వేదికగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియో కూడా ఢిల్లీ మెట్రోకు సంబంధించినదే కావటం…వివరాల్లోకి వెళితే…

ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి వింత విన్యాసాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక Reddit వినియోగదారు మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వీడియోను షేర్‌ చేశారు. సగుంన్ గ్లాసెస్ ధరించి, మొబైల్ ఫోన్ పట్టుకుని కనిపించే వ్యక్తి…మళ్లీ మళ్లీ వెనక్కి వంగి కనిపిస్తాడు. అంతలోనే అతడు అదే కోచ్‌లో అటు ఇటూ సంచరించడం ప్రారంభిస్తాడు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించాడు. ఆ మనిషి ఏదో పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందరిలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. చాలా మంది అతనిని అయోమయంగా చూడటం కూడా వీడియోలో కనిపించింది. అతడు ఏం చేస్తున్నాడో మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు..వీడియో చివరిలో అతడు ఒంటికాలిపై నిలబడి రౌండ్‌గా చక్కర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, అతడు ట్రై చేసినా ఫలితం లేకపోయింది. అతడి వింత ప్రవర్తన ఎలా ఉందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి భిన్న కామెంట్స్‌, లైకులు, షేర్లతో వైరల్‌గా మారింది. టిక్-టాక్ నిర్మూలించిన తర్వాత కొత్తగా రీల్స్-19 అనే కొత్త రకం ఇంటర్నెట్ వైరస్ ఇప్పుడు ప్రజల్ని వెంటాడుతోంది. ఇది Tik-tok మాదిరిగానే ఉంటుంది. కానీ, నిస్తేజమైన నలుపు, నీలం, ఎరుపు లోగోకు బదులుగా శక్తివంతమైన రంగు లోగోతో ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫేమస్‌ అవ్వాలనే కోరిక ఉన్న, పిచ్చిగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వారికి లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్‌లు లేవు. ”అని ఒక రెడ్డిట్ వినియోగదారు ఎగతాళిగా రాశారు. ఇలాంటి ఫన్నీ కామెంట్స్‌తో నెటిజన్లు వీడియోను విపరీతంగా వైరల్‌గా మార్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Delhi metro k nazare by u/VMod_Alpha in delhi

ఇంతకుముందు, సోషల్ మీడియాలో వచ్చిన మరొక వీడియోలో ఇద్దరు మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు చూపించింది. మొదట్లో, మహిళలు వేరు, వేరుగా నిలబడి ఉంటారు. కానీ, అంతలోనే అభ్యంతరకరమైన పదజాలంతో ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభిస్తారు. వారిలో ఒకరు తన షూని తీసి ఎదుటి మహిళను బెదిరించడం కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..