AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చేపలకు చేత్తో ఆహారం పెట్టబోయిన యువతి.. అమాంతంగా దూసుకొచ్చిన జెయింట్ ఫిష్‌.. ఆ తర్వాత సీన్‌ ఊహించలేరు..

గతంలో ఈజిప్ట్‌ లోని ఎర్ర సముద్రం రిసార్ట్‌ లో ఓ యువకుడు ఈత కొడుతుండగా సొరచేప అతడిపై దాడి చేసింది. సొర నుంచి తప్పించు కునేందుకు అతడు ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. సొర చేప అతడిని నోటకరుచుకుని నీటిలోకి లాక్కెళ్లిపోతుంది. ఈ భయనక సంఘటన మొత్తం యువకుడి తండ్రి కళ్లముందే జరిగిపోయింది. చూస్తుండగానే తన కుమారుడిపై సొర దాడి చేయడం చూసిన ఆ తండ్రి వెంటనే బోటులో వెళ్లి అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు..కానీ,అప్పటికే సొర చేప యువకుడిని నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. తండ్రి కళ్ల ముందే కొడుకును మింగేసింది ఆ సొర చేప.

Watch: చేపలకు చేత్తో ఆహారం పెట్టబోయిన యువతి.. అమాంతంగా దూసుకొచ్చిన జెయింట్ ఫిష్‌.. ఆ తర్వాత సీన్‌ ఊహించలేరు..
Big Fish Swallowed Womans H
Jyothi Gadda
|

Updated on: Aug 13, 2023 | 7:11 AM

Share

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో చాలా వీడియోలు సరదాగా, హాస్యభరితంగా ఉంటాయి. అయితే, కొన్ని కొన్ని వీడియోలు భయానకంగా, ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఓ భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో ప్రారంభంలో ఒక యువతి న ఒడ్డు నుండి నది వరకు నిర్మించిన బోట్ జెట్టీపై వాలుతూ.. చేతిలో హాట్‌డాగ్‌ పట్టుకుని అందరికీ చూపిస్తుంది. ఆ తర్వాత హాట్ డాగ్‌ను ఆమె నీళ్లలోకి ముంచి పట్టుకుంటుంది. అంతలోనే ఊహించని సీన్‌ ఎదురైంది. నదిలో ప్రయాణిస్తున్న ఆ మహిళకు ఏమైందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. యువతి నీళ్లలో చేతులు పెట్టిన కొన్ని సెకన్లలోనే నీటి నుండి ఒక భారీ చేప యువతి చేతిని సగం నోటిలోకి తీసుకుంటుంది. ఈ షాకింగ్‌ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోను ఎనిజేటర్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. నీళ్లలోంచి ఒక పెద్ద చేప హఠాత్తుగా బయటకు వచ్చింది. ఈ జెయింట్ ఫిష్ ఆ యువతి చేతి భాగాన్ని తన నోటిలో మోచేతి వరకు నోట్లోకి తీసుకుంటుంది. ఈ స్లో-మోషన్ ఫుటేజ్ చివరిలో చేప తన ఆహారంతో తిరిగి నీటి కిందకు వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఆ యువతి తన చేతిని క్షేమంగా వెనక్కి తెచ్చుకున్నందుకు ఆనందంతో నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను ఇప్పటికే 29 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. చాలా మంది యువతి చేసిన పని ప్రమాదకరమని, ఇలాంటి తెలివితక్కువ పనులేంటని అంటున్నారు. ఇకపోతే, ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుందని తెలిసింది.

గతంలో ఈజిప్ట్‌ లోని ఎర్ర సముద్రం రిసార్ట్‌ లో ఓ యువకుడు ఈత కొడుతుండగా సొరచేప అతడిపై దాడి చేసింది. సొర నుంచి తప్పించు కునేందుకు అతడు ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. సొర చేప అతడిని నోటకరుచుకుని నీటిలోకి లాక్కెళ్లిపోతుంది. ఈ భయనక సంఘటన మొత్తం యువకుడి తండ్రి కళ్లముందే జరిగిపోయింది. చూస్తుండగానే తన కుమారుడిపై సొర దాడి చేయడం చూసిన ఆ తండ్రి వెంటనే బోటులో వెళ్లి అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు..కానీ,అప్పటికే సొర చేప యువకుడిని నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. తండ్రి కళ్ల ముందే కొడుకును మింగేసింది ఆ సొర చేప. ఈ విషాద సంఘటన గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..