జర భద్రం.. వీళ్ళు మీ ఏరియాకు వచ్చారంటే.. మీ ఇళ్లన్నీ గుల్లే.. పైకి చిత్తు కాగితాలు ఏరుకుంటూ..

తెనాలిలోని రామలింగేశ్వర వీథిలోని పేటలోని తోట వారి వీధి.. ఇదే ఏరియాలోని మల్లిఖార్జున శర్మ ఘనాపాఠి వారి ఇల్లు ఉంది.. అయితే.. ఎప్పటిలాగే శర్మ.. యజ్ఞం నిర్వహించేందుకు గత నెల 31వ తేదీన ఊరెళ్లారు. అయితే తర్వాత రోజు ఇంటి గ్రిల్స్ తీసి ఉండటంతో..

జర భద్రం.. వీళ్ళు మీ ఏరియాకు వచ్చారంటే.. మీ ఇళ్లన్నీ గుల్లే.. పైకి చిత్తు కాగితాలు ఏరుకుంటూ..
Garbage
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 12, 2024 | 7:09 PM

చిత్తు కాగితాలు ఏరుకుంటుంటారు.. రోజుకో ఏరియాలో బాటిల్స్, చెత్త సేకరిస్తుంటారు. అయితే, వేస్ట్ ఏరుకుంటూనే మాటు వేస్తారు. ఆ ఏరియాలోని తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు. అనుమానం రాకుండా ఆ ఇంట్లోకి చొరబడతారు. తాళాలు పగులకొట్టి అందినకాడికి దండుకుంటారు. ఇదంతా చేసేది ఎవరుకుంటున్నారా.. చేయి తిరిగిన చోరులు.. మగవాళ్లేనేమో అనుకంటున్నారా అయితే మీ ఊహా కరెక్ట్ కాదు. చిత్తు కాగితాలు ఏరుకుంటూనే తాళం వేసిన ఇళ్లలో చోరిలకు పాల్పడుతుంది ఇద్దరూ మహిళలు.. వీరిని గుర్తించిన తెనాలి పోలీసులకు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు..

తెనాలిలోని రామలింగేశ్వర వీథిలోని పేటలోని తోట వారి వీధి.. ఇదే ఏరియాలోని మల్లిఖార్జున శర్మ ఘనాపాఠి వారి ఇల్లు ఉంది.. అయితే.. ఎప్పటిలాగే శర్మ.. యజ్ఞం నిర్వహించేందుకు గత నెల 31వ తేదీన ఊరెళ్లారు. అయితే తర్వాత రోజు ఇంటి గ్రిల్స్ తీసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చిన శర్శకు విషయం చెప్పారు. వెంటనే వచ్చిన ఆయన ఇంటి తలుపులు తీసి విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరి చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న అదే ఏరియాలో చిత్తు కాగితాలు ఏరుకుంటున్న బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన రోశమ్మ, మహంకాళిలను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు.

Tenali Police

Tenali Police

ఇద్దరు మహిళలు చిత్తు కాగితాలు ఏరుకుంటూ శర్మ ఇంటిలో ఎవరూ లేకపోవడాన్ని గమనించారు.. అనంతరం గోడ దూకి ఇంటిలోకి వెళ్లారు. ఇనుప రాడ్డుతో తాళం పగుల కొట్టారు. లోపలికి వెళ్లి ట్రంక్ పెట్టె తెరిచి అందులో పది లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చిత్తు కాగితాల సంచుల్లో వేసుకొని దర్జాగా వెళ్లిపోయారు. అయితే దర్యాప్తు చేస్తున్న పోలీసులు వేలి ముద్రలు, సిసి కెమెరా విజువల్స్ ఆధారాంగా వీరిద్దరే చోరి చేసినట్లు రూఢి చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చోరి చేసిన బంగారు, వెండి ఆభరణాలను తమ ఇంటి దగ్గరలోని చెత్త కుప్పలోనే దాచి ఉంచారు. ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో తాము దొరికి పోయినట్లు భావించి చోరి సొత్తు దాచిన ప్రాంతాన్ని కూడా పోలీసులకు చూపించారు. దీంతో దొంగతనం చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిళలిద్దరిని అరెస్ట్ చేశారు.

అయితే.. మీ మీ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెనాలి డిఎస్పీ జనార్ధన రావు చెప్పారు. ఇటువంటి చోరీలను మొదటి రెక్కి చేసి తర్వాత సీన్ లోకి వస్తారని విచిత్ర వేషధారణలో తిరుగుతన్న వారిపై అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..