AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధను సంక్రాంతి పూజా సమయం, ప్రాముఖ్యత ఇదే!

ధను సంక్రాంతి అని పిలవబడే ఢహను సంక్రాంతి రాబోతుంది. సూర్యుడుధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ఇది సూచిస్తుంది. ఈ పండుగ రోజు భక్తులందరూఉదయాన్నే తల స్నానం చేసి, సూర్యుడికి నీళ్లుఅర్పించి, ఆశీర్వాదం పొందుతారు. ఈ పండుగ 2025 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన మంగళవారం జరుపుకోనున్నారు.

Samatha J
|

Updated on: Dec 11, 2025 | 4:08 PM

Share
ధను సంక్రాంతి అని పిలవబడే ఢహను సంక్రాంతి రాబోతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ఇది సూచిస్తుంది. ఈ పండుగ రోజు భక్తులందరూ ఉదయాన్నే తల స్నానం చేసి, సూర్యుడికి నీళ్లు అర్పించి, ఆశీర్వాదం పొందుతారు. ఈ పండుగ 2025 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన మంగళవారం జరుపుకోనున్నారు.

1 / 5
ధను సంక్రాంతి శుభ సమయం : ధను సంక్రాంతి పుణ్యకాలం ఉదయం 7 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. మధ్యలో 5 గంటల 10 నిమిషాల వ్యవధి. ఇక ధను సంక్రాంతి పుణ్యకాలం విషయానికి వస్తే ఉదయం 7 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల 51నిమిషాలు. వ్యవధి  గంట, 43 నిమిషాలు.

2 / 5
ధను సంక్రాంతి ప్రాముఖ్యత : ఒడిశా, తూర్పు భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే జగన్నాథ ఆలయాలకు భక్తులు తరలి వెళ్లి,  ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే రైతులు కూడా తమ పంట బాగా రావాలి అని పూజలు చేస్తుంటారు. ఒడిశాలో ధను సంక్రాంతిని ధను యాత్ర రూపంలో, జానపద ప్రదర్శనలు, శ్రీకృష్ణుడి ఇతిహాసాల నాటకీయాలతో ఘనంగా జరుపుకుంటారు.

3 / 5
ఈరోజున భక్తులు అందరు ఉదయాన్నే సూర్య దేవున్ని పూజిస్తారు. సూర్యోదయానికి ముందు నిద్రలేచి, తులసి కలిపిన నీటితో స్నానం ఆచరించి, ఓం ఘృణి సూర్యాయ నమ: అని జపిస్తూ పూజలు చేస్తారు. అదే విధంగా కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా నైవేద్యాలు కొబ్బరి పాయసం, పిఠ అనే ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేస్తారు. కొందరు ఈ రోజు ధాన ధర్మాలు చేస్తుంటారు.

4 / 5
ఇక సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే క్షణాన్ని సంక్రాంతి అంటారు. ఇది సంవత్సరానికి పన్నెండు సార్లు జరుగుతుంది. దానిదాని పరివర్తనంకు దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ధను సంక్రాంతి అనేది, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది.

5 / 5