- Telugu News Photo Gallery Spiritual photos These are the problems that will arise in 2026 according to Baba Vanga astrology
భయపెడుతున్న బాబా వంగా జోస్యం.. వామ్మో 2026లో దిన దిన గండమేనా?
బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో సంఘటనల గురించి ముందే అంచనా వేసి తెలియజేయడం జరిగింది. అందులో చాలా వరకు నిజం అయ్యాయి. అదే విధంగా ఆయన 2026 సంవత్సరంలో జరగబోయే వాటి గురించి కూడా అంచనా వేసి తెలియజేయడం జరిగింది. అయితే బాబా వంగా జోస్యం ప్రకారం 2026 చాలా భయంకరంగా ఉండబోతుందంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 11, 2025 | 3:52 PM

బల్గేరియాకు చెందిన అంధ జ్యోతిష్కురాలు బాబా వంగా, ఈమె1911లో జన్మించి 1996లో మరణించింది. ఈమె అంధురాలు అయినప్పటికీ, భవిష్యత్తు గురించి ముందే అంచనా వేసి, కరోనా, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, భూకంపాల గురించి చాలా విషయాలు తెలియజేసింది. ఇందులో ఆమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. ఆమె 2026 సంవత్సరం గురించి కూడా తెలియబరిచింది. అందులో ముఖ్యంగా ఆమె, ఏఐ ద్వారా మానవులకు ముప్పు తప్పదు, దిన దిన గండంలా మారిపోతుంది, దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారని తెలియజేయడం జరిగిందంట.

అదే విధంగా ఆమె 2026వ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కువ అవుతాయి, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనం ఇవన్నీ జరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వలన ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువా జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని తెలియజేసిందంట.

అలాగే 2026 సంవత్సరంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మానవులు సృష్టించినవి వారికి వ్యతిరేకంగా పని చేస్తాయి, అనేక ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా ఈ సంవత్సరంలో యుద్ధాలు కూడా జరగచ్చు అని ఆమె అంచనా వేసినట్లు తెలుస్తోంది.

బాబా వంగా అంచనాల ప్రకారం, 2026లో బంగారం రేటు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉన్నదంట. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. అలాగే, మానవులు, గ్రహాంతర వాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు అని ఆమె అంచనా వేసినట్లు సమాచారం. అలాగే అత్యంత భయానకంగా మూడో ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆమె అంచా వేసినట్లు సమాచారం.