- Telugu News Photo Gallery Do you know which month, according to Vastu Shastra, houses should not be built in?
వాస్తు టిప్స్ : ఈ నెలలో ఇల్లు కట్టకూడదంట.. కడితే అప్పుల బాధలు తప్పవు!
ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి ఒక అందమైన కల. సొంత ఇంటిని నిర్మించుకోవాలని చాలా మంది ఎన్నో కలలు కంటారు. అయితే కొంత మంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. ఇప్పుడు మూఢం కొనసాగుతుంది. దీని తర్వాత ఫిబ్రవరి నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇల్లు కట్టుకునే వారు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. మరీ ముఖ్యంగా ఈ నెలల్లో ఇల్లు కట్టుకోవడం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 11, 2025 | 2:54 PM

ఇల్లు నిర్మించుకోవడానికి శుభ సమయం అనేది తప్పని సరి. ఎవరైతే శుభ సమయంలో ఇంటిని నిర్మించుకుంటారో, వారి ఇల్లు ఆనందాలతో విరాజిల్లుతుంది. అందులో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అవి మనకు చాలా సంతోషాలను ఇస్తాయి. అందుకే ఇంటి నిర్మాణం విషయంలో వాస్తు నియమాలు తప్పక పాటించాలి. అయితే ఏ నెలలో ఇల్లు కట్టడం ప్రారంభించకూడదు అనేది చూద్దాం.

పుష్య మాసంలో ఇంటిని నిర్మించుకోకూడదంట. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు, భూ తల్లి గర్భవతి కాలంగా పరిగణించబడుతుంది కాబట్టి, ఈ సమయంలో భూమిని తవ్వడం వలన భూ మాత కోపానికి గురి అవుతుంది. దీంతో ఈ సమయంలో ఇంటి నిర్మాణం చేపట్టడం వలన ఇంటిలో ఆనందం లేకపోవడం, పిల్లలకు అనారోగ్య బాధలు, వ్యాపారాల్లో నష్టాలు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయంట.

చైత్ర మాసంలో ఇల్లు కట్టుకోవడం అస్సలే మంచిది కాదంట. ఈ సమయంలో కొత్త జీవితం ప్రారంభించి ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో పునాది తవ్వడం వలన భూమాతకు కోపం రావడం వలన , ఇంటిలో కలహాలు, ఆర్థిక నష్టాలు, గొడవలు వంటి సమస్యలు తలెత్తుతాయంట. అదే విధంగా అశ్విని మాసంలో ఇల్లు నిర్మించుకోవడం వలన స్త్రీలకు కష్టాలు, ఆర్థిక నష్టం, ఇంట్లో భద్రత లోపించడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి.

భాద్రపద మాసంలో ఇంటిని నిర్మించుకోవడం వలన పూర్వీకులు బాధపడుతరంట. వారు కోపానికి గురి అవుతారంట. అందువలన ఈ సమయంలో పునాది తీయడం వలన వ్యాపారంలో అడ్డంకులు, కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబానికే హాని జరుగుతుందంట.

జ్యేష్ఠ మాసంలో సూర్యుడు చాలా తీవ్రంగా ఉంటాడు. అంతే కాకుండా ఈ సమయంలో భూ తల్లి కూడా చాలా మండిపోతుందంట. అందువలన ఈ సమయంలో ఇల్లు కట్టడం వలన మానసిక ఒత్తిడి, అప్పుల సమస్యలు ఎక్కువ అవ్వడం జరుగుతుందంట.



