గజకేసరి రాజయోగం.. వీరి అదృష్టం తారు మారే!
గ్రహాల కలయిక లేదా సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. ఇక అత్యంత శక్తివంతమైన రాజయోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. అయితే కొత్త సంవత్సరంలో గజకేసరి రాజయోగం రెండు సార్లు ఏర్పడనున్నదంట. దీని వలన కొంత మందికి అదృష్టం తారుమారు కాబోతుందని చెబుతున్నారు పండితులు.
Updated on: Dec 11, 2025 | 2:57 PM

2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. త్వరలో 2026వ సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే 2026 జనవరి 3న మిథున రాశిలోకి చంద్రుడు సంచారం చేయనున్నాడు. తర్వాత మళ్లీ అదే రాశిలోకి జనవరి 30న ప్రవేశించనుంది. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్న రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి 2026లో గజకేసరి రాజయోగం వలన అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరి అదృష్టం ఒక్కసారి మారిపోయి, డబుల్ బెన్ఫిట్స్ అందనున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అందులో కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నింట్లో కలిసి వస్తుంది.

మేష రాశి : మేష రాశి వారికి 2026 లక్కీ ఇయర్ అని చెప్పాలి. వీరు ఊహించని విధంగా ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఆనందకరమై జీవితం మీ సొంతం అవుతుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతమైన సంవత్సరంగా చెప్పవచ్చు.2026 వీరు కోరుకున్న కోర్కెలు అన్నీ నెరవేరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆనందంగా జీవిస్తారు.



