కరీంనగర్ వెళ్తున్నారా.. తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవే!
డిసెంబర్, జనవరి నెలలో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఇక అందరూ ఎక్కువగా ఊటీ, పాండి చ్చేరి వంటి ప్లేసెస్‌కు వెళ్లడానికి ఇంట్రస్ట్ చూపుతుంటారు. కానీ మన దగ్గరలోనే కరీంనగర్ జిల్లాలో కూడా అందమైన ప్రదేశాలు ఉన్నాయంట. ఇక్కడ గొప్ప సంస్కృతికి నిదర్శనమైన ఎన్నో కట్టడాలను పర్యాటకులను ఆకర్షిస్తాయి. అందువలన కరీంనగర్ వెళ్తున్నవారు అయినా లేదా కరీంనగర్ దగ్గరలో ఉన్నవారు అక్కడ తప్పక కొన్ని ప్రదేశాలు సందర్శించాలంట. కాగా, కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన అందమై ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.
Updated on: Dec 11, 2025 | 3:11 PM

కరీంనగర్ జిల్లాలో మానేర్ నది ఒడ్డున ఉన్న అందమైన ఎలగందల్ కోట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది విదేశీయుల కోటను పోలి ఉంటుంది. పూర్వం ఇక్కడ కందులు బాగా పండించేవార, అందుకే ఈ ప్రాంతాన్ని ఎక్కువగా తెల్లకందుల అనే వారు కాలక్రమేణా ఈ ప్రాంతం ఎలాగందులగా మారిందని స్థలపురాణం చెబుతుంది. ఈ కోట సామంతుల వైభవాన్ని చాటుతుంది. ఈ కోట పచ్చని చెట్లు, 300 మెట్లు, బృందావన్ చెరుబు, కోటలోపల మసీదులు సమాధులు, రహస్య గదుల, మెట్ల బావులు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

రామగిరి ఖిల్లా : రామగిరి కోటాను రామగిరి ఖిల్లా అని కూడా పిలుస్తారు. అత్యంత సుందరమైన కోటాలో ఇది కూడా ఒకటి. ఈ కోట కరీంనగర్‌లో సందర్శించడానికి బెస్ట్ ప్లేస్. ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. ఈ కోట ఎక్కే సమయంలో గోదావరి నదుల విలీనం అయ్యే దృశ్యాన్ని చూడవచ్చునంట అంతే కాకుండా, ఈ కొండలో విలువైన ఆయుర్వేద మూలికు కూడా ఉన్నాయంట.

కరీంనగర్ జిల్లాకు కేవలం 8 కిమీ దూరంలో ఉండే నగునూరు కోట చాలా అద్భుతమైన కోట. ఇది గొప్ప కాకతీయుల కళకు నిదర్శనం. కాకతీయ రాజవంశం ముఖ్యమైన కోటలలో ఇదొక్కటి. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు. తెలంగాణలో దాచిన రత్నం ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన గతానికి నిదర్శనం.

కరీంనగర్ జిల్లా ఉన్న కోటిలింగాల క్షేత్రం అద్భుతమైన క్షేత్రాల్లో ఒకటి. ఇది క్రీ. పూ.4 శతాబ్దం నాటికి ది ఆంధ్రుల అతి ప్రాచీన రాజధానిగా ఉండేది. ఇక్కడ కోటలో లింగం ఉండటం వలన ఇది కోటలింగమైంది. తర్వాత గోదావరి నదీతీరంలో ఉండే ఈ పుణ్య క్షేత్రాన్ని గోదావరి నది కోటి ఇసుక రేణువుల సాయంతో నిర్మించం వలన ఈ పుణ్యక్షేత్రం కోటిలింగాల గా మారింది. ఇక్కడ సిద్ధేశ్వరుడు లిగరూపంలో కొలువుదీరాడు. గోదావరీ నది తీరాన, శాతవాహన కంచుకోటగా నిలిచిన మహాపుణ్య క్షేత్రం.

ఇవే కాకుండా, కరీంనగర్ జిల్లాలో, దిగువ మానేర్ డ్యామ్, వేములవాడ పుణ్యక్షేత్రం, కాళేశ్వరం, కొండగట్టు, ధర్మపురి ఈ ప్రదేశాలు అన్ని సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు.



