అస్తమానం ఫోన్ మాట్లాడొద్దన్నాడనీ.. భర్తని గొడ్డలితో నరికి చంపిన భార్య!
అల్లూరిజిల్లాలో దారుణం జరిగింది. అస్తమానం ఫోన్ మాట్లాడుతున్న భార్యను మందలించినందుకు భర్తపై పగబట్టింది ఓ ఇల్లాలు. అంతే తన ఫోన్ వ్యవహారాల్లో భర్త జోక్యం ఏంటని భావించి దారుణానికి పాల్పడింది. భర్తపై దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది కట్టుకున్న భార్య. గొడ్డలి కర్రతో దాడి చేయడంతో..

చింతపల్లి, డిసెంబర్ 11: అల్లూరిజిల్లాలో దారుణం జరిగింది. అస్తమానం ఫోన్ మాట్లాడుతున్న భార్యను మందలించినందుకు భర్తపై పగబట్టింది ఓ ఇల్లాలు. అంతే తన ఫోన్ వ్యవహారాల్లో భర్త జోక్యం ఏంటని భావించి దారుణానికి పాల్పడింది. భర్తపై దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది కట్టుకున్న భార్య. గొడ్డలి కర్రతో దాడి చేయడంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త ప్రాణాలు కోల్పోయాడు.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మేడూరుకు చెందిన రాజారావు… భార్య దేవి, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. భార్య తరచూ ఎక్కువసేపు మొబైల్‌లో కాల్స్ మాట్లాడుతోంది. అయితే మాట్లాడటం తగ్గించాలని భార్యకు సూచించాడు భర్త రాజారావు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే పక్కనే ఉన్న గొడ్డలి తీసి ఆ గొడ్డలికి ఉన్న కర్రతో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో రాజారావుకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కేజీహెచ్ లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రాజారావు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








