నవంబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గత కొన్ని నెలలుగా గణనీయంగా పెరుగుతోంది. నవంబర్ నెలలో ఇది రూ. 116 కోట్లకు పైగా రికార్డు సృష్టించింది. 21 లక్షలకు పైగా భక్తులు వెంకన్నను దర్శించుకోగా, 7.7 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ, కానుకలు పెరగడంతో శ్రీవారి ఆదాయం ఏటేటా కొత్త శిఖరాలను చేరుకుంటోంది. టీటీడీ కూడా భక్తులకు చక్కటి సేవలు అందించింది.
తిరుమల వేంకటేశ్వరునికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని శక్తి కొలదీ కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతినెలా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఎప్పటిలాగే ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది కూడా తిరుమల కొండ కిటికిటలాడింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నట్లే వెంకన్న హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. గత కొద్ది నెలలుగా అంతకంతకు పెరుగుతున్న హుండీ కలెక్షన్ ప్రతినెల రూ. 100 కోట్లు దాటుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది.ముఖ్యంగా హుండీ ఆదాయం ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది నవంబర్ నెలలో మొత్తం హుండీ ఆదాయం రూ. 116,20,74,100 టీటీడీ కి సమకూరింది. 21,15,330 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా 7,79,499 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. 57,35,934 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించగా నవంబర్ నెలలో తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు టిటిడి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించింది. రూ. 116 కోట్ల కు పైగా హుండీ ద్వారా ఆదాయాన్ని పొందడమే కాదు టిటిడి నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు, శ్రీవారికి విలువైన ఆభరణాలను, స్థిరాస్తులను, వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్ షాక్
ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ
షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్ !! ఇక వీరికి దబిడి దిబిడే
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే..
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా..
ఆవు పాలు తాగి... ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ

