Andhra Pradesh: ఏపీని గడగడలాడిస్తున్న స్క్రబ్ టైఫస్
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వేగంగా వ్యాపిస్తోంది. విజయనగరం నుండి రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి, గుంటూరు GGHలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖ సహా పలు జిల్లాల్లో కేసులు అధికం. అధికార యంత్రాంగం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి కట్టడికి చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి రాష్ట్ర ప్రజలను గడగడలాడిస్తోంది.
మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీని గడగడలాడిస్తోంది. విజయనగరంలో ఎంట్రీ ఇచ్చి.. ఏపీ మొత్తానికి పాకింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని వణికిస్తోంది. ఏపీలో స్ర్కప్ టైఫస్ కేసులు రోజురోజుకు పెరుగుతూ పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. వరుస మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో GGHలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ప్రభావంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూర్థమ్మ , బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న కొమెరపూడికి చెందిన లూర్థమ్మ గత నెల 28న చికిత్స కోసం GGHలో చేరారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స అందించారు. ఇంతలోనే మృత్యువాత పడ్డారు. ఇక బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ కూడా హైఫీవర్, ఇతర అనారోగ్య సమస్యలతో GGHకి వచ్చారు. ఈమెకు టెస్ట్‌లు చేయగా..స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ నాగేంద్రమ్ కూడా మరణించారు. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ధనమ్మ కూడా స్క్రబ్ టైఫస్‌తో GGHలో చనిపోయారు. దీంతో గుంటూరు GGHలో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 14 మంది చికిత్స పొందుతున్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో కట్టడికి చర్యలు చేపట్టాయి. ఏపీలో ఎక్కువగా చిత్తూరు, కాకినాడ, ఏలూరు, విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలో స్ర్కబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. విశాఖలో రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్ షాక్
ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ
షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్ !! ఇక వీరికి దబిడి దిబిడే
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే..
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా..
ఆవు పాలు తాగి... ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ

