Lionel Messi: మెస్సీతో ఫోటో దిగాలనుందా? షరతులు వర్తిస్తాయ్.. రూ. 9.95 లక్షలు + GST.. వారికి మాత్రమే ఛాన్స్!
ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కి రాబోతున్నారనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకుంది. తమ అభిమాన ఆటగాడిని చూడాలని, కలవాలని చాలా మంది ఫ్యాన్ ఇగర్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి మెస్సీని కలిసే అవకాశం కూడా కల్పిస్తున్నారు నిర్వాహకులు.. కానీ అతన్ని కలవాలంటే అభిమానులు భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. ఇంతకు మెస్సీని కలిసి అతనితో ఫోటో దిగేందుకు ఎన్ని డబ్బులు చెల్లించాలో తెలుసా?.

ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కి రాబోతున్నారనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకుంది. ఈ నెల డిసెంబర్ 13న నగరంలో జరగనున్న ‘ది గోట్ టూర్’ కార్యక్రమంలో పాల్గొనడానికి మెస్సీ వస్తున్నారు. ఈ సందర్బంగా, నిర్వాహకులు ఆయనతో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ సెషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీ రెడ్డి తెలిపారు. అయితే ఇందులో పాల్గొనాలంటే అభిమానులు భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది.
మెస్సీతో ఒక్క ఫోటో – రూ. 9.95 లక్షలు + GST
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెస్సీ భారత్ పర్యటనలో ఇది అత్యంత ప్రీమియం మీట్ అండ్ గ్రీట్. అభిమానులు తమ ఐడల్‌ను దగ్గరగా చూసి, షేక్ హ్యాండ్ ఇచ్చి, ఫోటో తీసుకునే అరుదైన ఛాన్స్ అని తెలిపారు. ప్రోటోకాల్, సెక్యూరిటీ పరంగా కేవలం 100 స్లాట్లు మాత్రమే ఇవ్వగలిగారని చెప్పారు. అయితే మెస్సీతో ఒక ఫోటో దిగాలంటే రూ. 9.95 లక్షలు (ప్లస్ జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. అదీ కాకుండా, ఈ అవకాశం కేవలం 100 మందికే పరిమితం.
ఈ ప్రకటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మెస్సీని ఒకసారైనా ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల కోరికతో ఈ ఆఫర్ లైమ్‌లైట్‌లో నిలిచింది. అయితే టికెట్ ధరపై మాత్రం అభిమానులను పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వర్గం అవునులే మెస్సీ లాంటి లెజెండ్ కు ఈ ధర న్యాయం అంటుంటే, మరికొందరు.. ఒక్క ఫోటోకు ఇది చాలా ఎక్కువ అమౌంట్ అని వాపోతున్నారు. ఏదైనా డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మెస్సీ అడుగుపెడుతుండటం మాత్రం నగర స్పోర్ట్స్ అభిమానులకు పండుగే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
