AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మెడికల్ మిరాకిల్..! చనిపోయిన బిడ్డలో కదలికలు.. ఆ తర్వాత సీన్ ఇది

శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో తీవ్ర విషాదంతో తరలించేందుకు సిద్ధమయ్యాడు తండ్రి వెంకట్ రావు. అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన గుండె‌తో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది.

AP News: మెడికల్ మిరాకిల్..! చనిపోయిన బిడ్డలో కదలికలు.. ఆ తర్వాత సీన్ ఇది
Telugu News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 12, 2024 | 5:43 PM

Share

ఓ తల్లి తనకు పుట్టబోయే బిడ్డ కోసం గంపెడాశతో ఎదురు చూసింది.. దంపతులిద్దరూ తమ శిశువు రూపాన్ని కళ్ళ ముందు తలచుకుని సంబరపడ్డారు.. పురిటి నొప్పులను భరించి ఆ తల్లి ఎట్టకేలకు శిశువు జన్మనిచ్చింది. ఇంతలోనే గుండె పగిలే వార్త.. ఆ శిశువుకు ఊపిరి లేదు. వైద్యులు గంటల తరబడి శ్రమించారు.. అయినా చలనం లేదు. బరువెక్కే హృదయంతో ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇంతలో ఓ అద్భుతం.. శిశువులో కదలికలు. హుటా హుటినా మళ్లీ ఆసుపత్రికి తెచ్చాడు తండ్రి.. వైద్యులంతా షాక్.. అరుదైన ఘటనతో ఇప్పుడు కేజీహెచ్‌లో ఆ శిశువు కోసం నిరంతరం శ్రమిస్తుంది వైద్య బృందం.

వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కండివరం గ్రామానికి చెందిన రమ్య గర్భిణి. ప్రసవం కోసం కేజీహెచ్‌లో చేరింది. కాస్త ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో గత మంగళవారం నాడు గైనిక్ వార్డులో అడ్మిట్ అయింది. వారాలు పూర్తి కాకపోవడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో 25 వారాలకే ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది ఆ తల్లి . శనివారం ఉదయం నాలుగు గంటలకు మగ బిడ్డ పుట్టాడు. 912 గ్రాముల బరువుతో తక్కువగా ఉండడంతో అవసరమైన వైద్య సేవలు అందించారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు ఆ కుటుంబానికి. ఎందుకంటే పుట్టిన ఆ శిశువులో చలనం లేదు.

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

ఇవి కూడా చదవండి

విషాదంలో పేరెంట్స్..

డ్యూటీలో ఉన్న వైద్యులు గంటలపాటు శ్రమించారు.. చివరకు 6 గంటల అబ్జర్వేషన్ తర్వాత బిడ్డకు ఊపిరి పోయిందని పేరెంట్స్‌కు వైద్యులు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్ ఎంట్రీ చేశారు. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు కుటుంబం. ఆ తరువాత శిశువును తండ్రికి అప్పగించారు

అంత్యక్రియల కోసం బయలుదేరి.. తిరిగి ఆసుపత్రికి..

శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో తీవ్ర విషాదంతో తరలించేందుకు సిద్ధమయ్యాడు తండ్రి వెంకట్ రావు. అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన గుండె‌తో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కి ఒడిలో ఉన్నశిశువులో కదలికలు గుర్తించాడు తండ్రి. అప్రమత్తమై హుటాహుటిన సమాచారం అందించడు. కేజీహెచ్‌కు తరలించి విషయం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో.. అప్రమత్తమైన వైద్యుల బృందం పీడియాట్రిక్ ప్రత్యేక వైద్యులకు కేసును అప్పగించారు. ‘పుట్టినప్పుడే నా బిడ్డకు చలనం లేదు.. శిశువును నాకు వైద్యులు అప్పగించారు.. ఇంటికి బయలుదేరా.. శిశువులో చలనం వచ్చినట్టు గుర్తించి మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చా.. వెంటనే స్పందించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.’ అని అన్నారు శిశువు తండ్రి వెంకటరావు.

సస్పెండెడ్ యానిమేషన్… వైద్య పరిభాషలో ఏపెనిక్స్ స్పెల్‌గా గుర్తింపు…

ప్రస్తుతం కేజీహెచ్ పిల్లల ప్రత్యేక వైద్య విభాగంలో శిశువు చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే దీన్ని సస్పెండెడ్ యానిమేషన్‌గా అభివర్ణిస్తున్నారు వైద్యులు. నెలలో నిండకుండానే పుట్టడం.. బరువు కిలో కంటే తక్కువగా ఉంటే.. ఆ శిశువు ప్రాణాలతో కోలుకునే అవకాశాలు చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో పుట్టే శిశువులు అరుదుగా ఊపిరి బిగపెట్టి ఉండిపోతారు. పల్స్ కూడా ఉన్నట్టు బయటపడదు. దాన్నే వైద్య పరిభాషలో ఎపెనిక్ స్పెల్‌గా పరిగణిస్తామని అంటున్నారు వైద్యులు. ఎటువంటి అరుదైన ఘటన తన 40 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదు అంటున్నారు సూపరింటెండెంట్. తానే కాదు గైనిక్ డాక్టర్ల జీవితకాలంలో ఎటువంటి కేసులు చాలా అరుదని అంటున్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద.

విచారణకు ఆదేశం..

ఆ శిశువుకు అవసరమైన అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నారు నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు కేజీహెచ్‌లోని పిల్లల వైద్యుల బృందం. శిశువు బరువు చాలా తక్కువగా ఉండడంతో పాటు ప్రీ మెచ్యూర్‌గా జన్మించడంతో కోలుకోవడం చాలా అరుదు అంటున్నారు వైద్యులు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సూపర్ ఇంటెండెంట్. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపింది. బిడ్డకు మిరాకిల్‌గా జీవం వచ్చి కదలికల మొదలయ్యాయో.. అదే మిరాకిల్‌తో త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..